మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేసింది. ఇక భవిష్యత్తును జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని నేటి తరం హీరోయిన్ల తో పోటీలో నిలబడటమే. ఇప్పటికే బుల్లి తెరపై యాంకర్ గా తన మార్క్ ను నిరూపించుకుంది. మెగా ముద్ర- యాంకర్ మార్క్ అమ్మడికి బోలెడంత ప్రచారాన్ని కూడా తెచ్చిపెట్టేసింది. పూర్తి స్థాయిలో హీరోయిన్ గా ప్రమోట్ కాకుండానే పాపులారిటీని సంపాదించేసింది. ఆరంభంలో మెగా ఫ్యామిలీ అమ్మడి విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్నా ఇప్పుడు మాత్రం సంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది. అయితే ఇటీవల ఓ సందర్భంలో సొగసరి తన పెళ్లి గురించి అడిగితే ఆసక్తికరంగా మాట్లాడింది.
నాకు తల్లిదండ్రులు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. వాళ్ల నిర్ణయాలను నేను ఎప్పుడూ గౌరవించాలి. నాకు తగ్గ వాడు ఎలా ఉండాలన్నది అమ్మకే అప్పజేప్పేశా. ఆ విషయంలో తల్లిదండ్రుల మాటను జవదాటేది లేదు. ఒక గృహిణిగా నాకు అమ్మే నాకు రోల్ మోడల్. అమ్మలానే పిల్లలను పెంచడం కుటుంబాన్ని చూసుకుంటాను. అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అవుతాను. అప్పుడే కుంటుబాన్ని చూసుకునే ఎక్కువ సమయం కూడా దొరుకుతుందని చెప్పకొచ్చింది.
The post ఆ ఛాయిస్ అమ్మకే ఇచ్చేశాను appeared first on MaaStars.