గతేడాది కేన్స్ చలన చిత్రోత్సవాల్లో సోనమ్ కపూర్ వేసుకున్న బట్టలపై ఇండియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా పైఅందాలన్నీ కనిపించేలా సోనమ్ వేసుకున్న డ్రెస్ గురించి కామెంట్ చేశారు. మళ్లీ ఈ యేడాది కేన్స్ వేడుక వస్తుంది. లోరియల్ బ్రాండ్ అంబాసిడర్ హోదాలో సోనమ్ అక్కడికి వెళ్ళడానికి రెడీ అయ్యింది. ఈసారి కూడా కొత్త కొత్త ఫ్యాషన్లను పరిచయం చేస్తానని చెబుతోంది. విమర్శల సంగతి ఏంటంటే.. తొక్కలో విమర్శలను పట్టించుకొనని చెప్పింది. ” గతేడాది నా దుస్తుల గురించి కొందరు చేసిన విమర్శలను నేనసలు పట్టించుకోలేదు. కొత్త ఫ్యాషన్ డ్రస్సులను వేసుకోవడం నాకిష్టం. నా దుస్తులు అందరికీ నచ్చుతాయో.. లేదో.. అని భయపడను” అని చెప్పింది. సోనమ్ స్టేట్మెంట్ విన్న తర్వాత విమర్శలు చేయడం అనవసరం అని వదిలేస్తారో.. ఈసారి విమర్శలకు మరింత పదును పెడతారో.. వెయిట్ అండ్ సి. సోనమ్ అభిమానులకు మాత్రం పండగే.
The post తొక్కలో విమర్శలు పట్టించుకోదట! appeared first on MaaStars.