శుక్రవారం హిందీలో ఓ సినిమా విడుదలైంది. సినిమా పేరు ‘వన్ నైట్ స్టాండ్’. అంటే.. ఒక్క రాత్రి కలసి సుఖం అనుభవించడం. ఇందులో హీరోయిన్ సన్నీ లియోన్. ట్రైలర్, సాంగ్స్ చూసి సినిమా ఎలా ఉంటుందో ఓ అంచనాకు రావడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, మీ ఊహలన్నీ తప్పే. సినిమాలో మంచి కథ ఉందని ప్రమోషన్ టైంలో సన్నీ లియోన్ తెగ చెప్పింది. దాంతో ఏముందో చూద్దామని క్రిటిక్స్ సినిమాకి వెళ్ళారు. వాళ్ళ మైండ్ బ్లాంక్ అయినంత పనైందట. తలా తోకా లేకుండా దర్శకుడు సినిమా తీశాడని ఓస్థాయిలో విమర్శించారు. 99 నిమిషాల సన్నీ లియోన్ సీన్లు తప్ప ఇంకేమీ లేవని స్పష్టం చేశారు. సన్నీ లియోన్ సినిమా అంటే ప్రేక్షకులు అవే ఆశిస్తారు. దర్శకుడు అటువంటి సినిమా తీశాడు. సన్నీ చివరి సినిమాలన్నీ అంతే కదా, విమర్శించడం దేనికీ అంటే.. మధ్యలో ఫెమినిజం, మహిళల శృంగార హక్కులు అంటూ ఏదేదో చెప్పాడట. రివ్యూలలో పెళ్లయిన మహిళలను ఈ సినిమాకి దూరంగా ఉండమని, అసలు అమ్మాయిలు సినిమా చూడొద్దని రాశారంటే అర్థం చేసుకోండి మరి.
The post ‘సన్నీ లియోన్’ సీన్లు మాత్రమే! appeared first on MaaStars.