“అసలు నా కెరీర్‌లో ఫ్లాప్ సినిమాలే ఉండకూడదని అనుకున్నా. అయితే ఏం చేస్తాం. అనుకున్నదొక్కటి అయినదొక్కటి“ అని అంటున్నాడు సందీప్‌కిషన్. కెరీర్‌లో కొన్ని ఫ్లాపులు, మరికొన్ని హిట్లు వచ్చాయి. `వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్` తర్వాత చక్కని గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం రాజసింహా దర్శకత్వంలో నా కెరీర్‌లోనే కాస్ట్ లీ సినిమాలో నటిస్తున్నా. ఒక్క అమ్మాయి తప్ప.. అనేది టైటిల్. ఈ టైటిల్ క్యారెక్టర్‌కి కళ్లతోనే హావభావాలు పలికించే అందమైన హీరోయిన్ కావాలి. అందుకే నిత్యామీనన్‌ని సంప్రదించాము. తను అడగ్గానే అంగీకరించింది. ఇక నిత్యా హైట్‌తో నాకు ఎలాంటి సమస్యా రాలేదు. .. అంటూ చక చకా డీటెయిల్స్ చెప్పేశాడు సందీప్ కిషన్. నేడు పుట్టినరోజు సందర్భంగా కెరీర్ సంగతులు మరిన్ని ముచ్చటిస్తూ ..
“2012లో ఒక్క అమ్మాయి తప్ప కథ విన్నా. హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై జరిగిన ట్రాఫిక్ జామ్ ఓ యువకుడి జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పిందన్నదే సినిమా. నా సినిమాల్లోకెళ్లా కాస్ట్‌లీ. గ్రాఫిక్స్ వర్క్ భారీగానే ఉంటుంది“ అంటూ సందీప్ డీటెయిల్స్ చెప్పాడు. నేను ఇంతవరకూ పని చేసిన దర్శకుల్లోనే బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్ రాజసింహా. బెస్ట్ కమర్షియల్ రైటర్ కూడా… అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో `నక్షత్రం` సినిమాలో నటిస్తున్నానని చెప్పారు.
The post నా కెరీర్‌లో ఫ్లాపులే ఉండొద్దనుకున్నా- సందీప్‌కిషన్ appeared first on MaaStars.