ఇటీవలి కాలంలో మలయాళ చిత్రపరిశ్రమలో కొన్ని అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. ప్రముఖ మలయాళ నిర్మాత, నటుడు అజయ్ కృష్ణన్ తన సినిమా రషెస్ చూసుకుని ఉద్వేగంలో ఆత్మహత్య చేసుకోవడం పెను సంచలనమైంది. ప్రస్తుతం ఈ కేసు విషయమై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఇంతలోనే మరో షాకింగ్ న్యూస్ మల్లూవుడ్‌ని విషాదంలో నింపింది. నిర్మాత అజయ్‌కృష్ణ గాళ్‌ఫ్రెండ్ వినీతా నాయర్ ఆత్మహత్యా యత్నం చేసింది. అయితే ఈ ప్రయత్నానికి ముందు తాను రాసిన లేఖలో అజయ్ మరణం తట్టుకోలేక, ఒత్తిడి భరించలేకే సూసైడ్ చేసుకుంటున్నానని పేర్కొంది. అవరుదె రవుగల్ అనే చిత్రాన్ని నిర్మించిన అజయ్ ఆర్థిక కారణాల వల్లనే ఆత్మహత్యకు పాల్పడ్డారని ఇటీవల కథనాలొచ్చాయి.
అయితే 28ఏళ్ల వినీత మరణం వెనక ఇంకేదైనా మిస్టరీ ఉందా? అజయ్ మరణానికి ఈ మరణానికి లింకు ఇంకేదైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది.
The post నిర్మాత గాళ్‌ఫ్రెండ్ ఆత్మహత్యాయత్నం! appeared first on MaaStars.