ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) మే 27వ తేదీ నుంచి 29వరకూ డల్లాస్, అమెరికాలో ఓ కార్యక్రమం నిర్వహిస్తుంది. నాటా కన్వెన్షన్ పేరుతో జరిగే ఈ కార్యక్రమానికి దగ్గుబాటి రానా, నాని, సంపూర్నేష్ బాబు, రకుల్ ప్రీత్, హంసా నందిని, నిత్యా మీనన్.. ఇంకా డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, యాంకర్లు చాలామంది వస్తున్నట్టు పోస్టర్ ప్రింట్ చేశారు. ఇంతవరకూ బాగుంది కానీ, నాటా (నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్) చేసిన పనికి రానాకి ఎక్కడో కాలింది. నాటా నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు మేటర్ ఏంటంటే.. “ఈ కార్యక్రమంలో నేను భాగం కాదు. వాళ్ళు నా ఫోటో ఎలా పెట్టారో అర్థం కావడం లేదు” అని రానా ట్వీట్ చేశాడు. రానాతో పాటు నాని కూడా జత కలిశాడు. నాకు కూడా ఈ కార్యక్రమం గురించి తెలీదని చెప్పాడు. నాటా చర్య మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టర్లో చాలా మంది సెలబ్రిటీలున్నారు. వాళ్ళకైనా ఈ కార్యక్రమానికి వెళ్తున్నట్లు తెలుసో లేదో!!
The post రానాతో పాటు నానికీ కోపమే appeared first on MaaStars.