Quantcast
Channel: MaaStars
Viewing all articles
Browse latest Browse all 2793

నూతన తారలతో ప్రముఖ ఎన్.శంకర్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్!

$
0
0

Senkar (4)-Maa Stars
ఎన్‌కౌంటర్, శ్రీరాములయ్య, జయం మనదేరా, భద్రాచలం, యమజాతకుడు ఆయుధం, జై బోలో తెలంగాణ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాందించుకున్న సుప్రసిద్ధ దర్శకుడు ఎన్.శంకర్ తన స్వీయ దర్శకత్వంలో మహాలక్ష్మీ ఆర్ట్స్ పతాకంపై మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నాడు. తనదైన శైలిలో అంతా కొత్తవారితో ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శక, నిర్మాత ఎన్.శంకర్ తెలియజేస్తూ ‘ ప్రతిభ వున్న యువ నటీనటులను ఈ నూతన చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేయాలని నిర్ణయించాను. ప్రస్తుతం వారి అన్వేషణ సాగుతుంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ పాత్రల కోసం 18 నుంచి 25 సంవత్సరాల వయసు గల యువతీ యువకులు కావాలి. చిత్రంలో ఎనభై శాతం పాత్రలు ఈ ఏజ్ గ్రూప్‌కు చెందినవే. ఇతర పాత్రల కోసం కూడా 5 నుంచి 80 సంవత్సరాల వయసు మధ్య గల వారిని కూడా నటనపై ఆసక్తి వుంటే వారికి తగిన పాత్రలు వున్నాయి. గుడ్ లుకింగ్‌గా వుండి… నటనపై ఆసక్తి వుండి.. నటన రాకున్నా ఎంపిక తర్వాత వర్క్‌షాప్ నిర్వహించి తగిన శిక్షణ ఇస్తాం. ఆసక్తి గల వారు ఫోటోలు, పోర్ట్ పోలియోలు, మే 31వరకు mahalakshmiarts@gmail.com కు ఈమెయిల్ చేయండి. ప్రతిభ గల వారికి తప్పకుండా మంచి అవకాశం కల్పిస్తాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాను’అని తెలిపారు.

The post నూతన తారలతో ప్రముఖ ఎన్.శంకర్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్! appeared first on MaaStars.


Viewing all articles
Browse latest Browse all 2793

Trending Articles