
రాజకీయాలకు చిరంజీవి బ్రేక్! అంటే ఫుల్ స్టాప్ పెడుతున్నారు అనుకోవద్దు. 150వ సినిమా కోసం స్మాల్ బ్రేక్ తీసుకుని సినిమా కెరీర్ మీద కాన్సంట్రేట్ చేయనున్నారు. మెగాస్టార్ 150వ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? అని ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు రామ్ చరణ్ ఓ శుభవార్త చెప్పాడు. మేలో చిరంజీవి 150వ పట్టాలు ఎక్కుతుందని ఢిల్లీలో చరణ్ స్పష్టం చేశాడు. తెలుగు మీడియాను వదలి కంట్రీ కాపిటల్ సిటీలో చెప్పడం ఏంటని ఆలోచిస్తున్నారా? ఓ పని మీద మనోడు ఢిల్లీ వెళితే, అక్కడి మీడియా చెర్రీని చిరు 150వ సినిమా, రాజకీయాల గురించి ప్రశ్నించింది. “మేలో 150వ సినిమా షూటింగ్ మొదలవుతుంది. పాలిటిక్స్ నుంచి బ్రేక్ తీసుకుని షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి నేనే నిర్మాత కావడంతో చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. నా షూటింగ్, నాన్న సినిమా వర్క్స్ ఎలా మేనేజ్ చేస్తానో నాకైతే అర్థం కావడం లేదు” అని చరణ్ చెప్పాడు.
వి.వి.వినాయక్ దర్శకత్వంలో తమిళ్ సూపర్ హిట్ మూవీ ‘కత్తి’ని 150వ సినిమాగా చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. ఇటీవల అభిమానుల సమావేశంలో ‘కత్తిలాంటోడు’ టైటిల్ అనుకుంటున్నట్లు చిరంజీవి ప్రకటించారు కూడా. అయితే, టైటిల్ మీద మిశ్రమ స్పందన రావడంతో చేంజ్ చేసే ఛాన్స్ ఉందట.
The post రాజకీయాలకు చిరంజీవి బ్రేక్! appeared first on MaaStars.