మెరీనా సినిమా ద్వారా శివకార్తికేయన్ ను సినిపరిశ్రమకు పరిచయం చేశారు దర్శకుడు రాండిరాజ్. రెండవ సినిమా కేడి బిల్లా, కిలాడి రంగా సినిమాలోనూ శివకార్తికేయన్ కు అవకాశం ఇచ్చారు పాండిరాజ్. శింబు, నయనతార జంటగా ఇదు నమ్మఆలు సినిమాను రూపొందిస్తున్న పాండిరాజ్ అనంతరం కేడి బిల్లా కిలాడి రంగా సినిమాకు సీక్వేల్ రూపొందించనున్నారు. ఈ సినిమాలో హీరోగా మొదట శివకార్తికేయన్ సంప్రదించగా జీతం అధికంగా అడగటంతో ఆ స్థానంలో జీవి.ప్రకాష్ చేరారు. జీవి.ప్రకాష్ కు జంటగా లక్ష్మిమీనన్ నటించనున్నారు. తర్వలోనే ఈ సినిమా పూర్తి వివరాలను ప్రకటించనున్నారు దర్శకుడు పాండిరాజ్.
The post శివకార్తికేయన్ స్థానంలో జీవీ.ప్రకాష్ appeared first on MaaStars.