Quantcast
Channel: MaaStars
Viewing all articles
Browse latest Browse all 2793

డిఫరెంట్ క్రైమ్ కామెడీగా ‘ఎరుపు’

$
0
0
డిఫరెంట్ క్రైమ్ కామెడీగా ‘ఎరుపు’
సుధీర్, ప్రత్యూష జంటగా ర్యాండమ్ థాట్స్ పతాకంపై ప్రముఖ పబ్లిసిటి డిజైనర్స్ అనిల్-భాను సమర్పణలో ‘ఓయ్’ చిత్ర దర్శకుడు ఆనంద్ రంగాతో కలిసి శేషా రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఎరుపు’. ఈ చిత్రం ద్వారా సంచలన దర్శకుడు, రామ్‌గోపాల్ వర్మ, ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన వెంకట్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ ‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, స్క్రీన్‌ప్లే ప్రధానాంశంగా రూపొందుతున్న చిత్రమిది. క్షణం క్షణం, స్వామిరారా తరహాలో కొనసాగే ఈ  క్రైమ్ కామెడీలో పలు సస్పెన్స్ ఎలిమెంట్స్ వుంటాయి. త్వరలో ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, హీరో సిద్దార్థ్‌లు ఈ చిత్రం టీజర్, ఫస్ట్‌లుక్‌లను వాళ్ల ట్విట్టర్స్ ద్వారా విడుదల చేయబోతున్నారు’ అని తెలిపారు. భద్రమ్, అజయ్‌ఘోష్, కృష్ణేశ్వర్‌రావు, భాను అవిర్నేని, వీరేన్ తంబిదొరై తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినారియో: ఆనంద్ రంగా, టి.శివ, డైలాగ్స్: మీరాక్, పాటలు: వనమాలి, వశిష్ట శర్మ, స్వేచ్ఛ, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, కెమెరా: నాని చమిడిశెట్టి, నేపథ్య సంగీతం: కుమరన్, సంగీతం: శక్తి కాంత్ కార్తీక్, సహ నిర్మాతలు: తంబరి క్రియేషన్స్, సమర్పణ: అనిల్-భాను, 

The post డిఫరెంట్ క్రైమ్ కామెడీగా ‘ఎరుపు’ appeared first on MaaStars.


Viewing all articles
Browse latest Browse all 2793

Trending Articles