Quantcast
Channel: MaaStars
Viewing all articles
Browse latest Browse all 2793

`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!

$
0
0

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 25న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ…

** నేలటిక్కెట్టు అనే పదం మాస్‌ పదంలా అనిపించినప్పటికీ ఈ నేలటిక్కెట్టు ఫైట్స్‌ చేసే మాస్‌ కాదు. జనంతో రిలేషన్‌లో ఉండే మాస్‌. ఇందులో హీరో సరదా సరదాగా చేసే పనులను చూసి అందరూ ఆయన్ని 420 అని అనుకుంటూ ఉంటారు.

** చిన్నప్పుడు సినిమాలను బెంచీల్లోనే చూశాను. హైదరాబాద్‌ వచ్చినప్పుడు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసేటప్పుడు ఒక్కొక్క సినిమాను రెండుసార్లు చూసేవాడిని. బాల్కనీలో చూశాను.. నేలటిక్కెట్‌లో కూర్చుని చూశాను.అలాంటి సందర్భాఆల్లో అక్కడ ఉన్న ఆడియెన్స్‌ ఫీలింగ్‌ ఏంటని అడిగి తెలుసుకునేవాడిని. బాల్కనీ కూర్చున్న ప్రేక్షకులు సినిమా ఎలా చేశారనే విషయాన్ని పట్టించుకుంటారు. కానీ నేలటిక్కెట్‌ ప్రేక్షకులు సినిమా నచ్చిందే చూస్తారు.

** టైటిట్‌ మాత్రమే మాస్‌గా అనిపిస్తుంది. ‘సొగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో ఎలాంటి ఎమోషన్స్‌ ఉన్నాయో ఇక్కడ కూడా అలాంటి ఎమోషన్స్‌ ఉంటాయి. ఇది ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ సినిమా మాత్రమే కాదు.. హండ్రెడ్‌ పర్సెంట్‌ ఫ్యామిలీ మూవీ. అందరికీ నచ్చే చిత్రమిది. సినిమా చూసిన సెన్సార్‌ సభ్యులు చాలా మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌ కలిగిందని చెప్పడం ఆనందంగా అనిపించింది.

**రవితేజగారు ఇందులో ఆవారా పాత్రలో కనపడతారు. ఆయన చేసే జీవిత జర్నీలో మనషులందరూ ఉండాలనుకునే వ్యక్తి. ఈ ప్రయాణంలో ఎంత మందిని తన కుటుంబంగా చేసుకున్నాడనేదే సినిమా.

**సినిమాలో ఎక్కువ మంది ఆర్టిస్టులున్నా కూడా సినిమాను అనుకున్న ప్లానింగ్‌లో పూర్తి చేశామంటే కారణం మా టీం. చాలా కష్టపడ్డారు. ఎఫర్ట్‌తో పాటు అదృష్టం కూడా కలిసొచ్చింది. కథ రాసినప్పుడు ఎలా ఉందో తీసినప్పుడు అలాగే అనిపించింది. ప్రేక్షకుడిగా సినిమాను చూసినప్పుడు కొన్ని సీన్స్‌కు నవ్వుకున్నాను. కొన్ని సీన్స్‌ను బాధపడ్డాను.

** రామ్‌ తాళ్లూరిగారు బెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ ఉన్న వ్యక్తి. కాబట్టి ఆయన్ను చూస్తే కొత్త ప్రొడ్యూసర్‌ అని ఎవరూ అనుకోరు. ఆయన మంచి వ్యాపారవేత్త కూడా. ఇక్కడ నుండి అన్నీ వ్యవహరాలను చూసుకున్నారు. నేను ఏదైనా కావాలని మెసేజ్‌ పెడితే ప్రొడక్షన్‌ టీంకు చెప్పి వెంటనే అరెంజ్‌ చేసేవారు. సినిమాను అనుకున్నంత ఫాస్ట్‌గా పూర్తి చేయగలిగామంటే కారణం నిర్మాతగారి సహకారమే.

** రవితేజగారితో ఎప్పుడో సినిమా చేయాల్సింది. కానీ రవితేజగారికి ఉన్న కమిట్‌మెంట్స్‌ వల్ల కుదరలేదు. ఈ సినిమా చేయాలని అనుకున్నప్పుడు స్టోరీ నెరేషన్‌కు ఆయన్ను వెళ్లి కలిశాను. నీకు చాలా పనులున్నాయి. ముందు అవన్నీ పూర్తి చేసుకో. తర్వాత చెబుదువుగానీ అన్నారు.

The post `నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా! appeared first on MaaStars.


Viewing all articles
Browse latest Browse all 2793

Trending Articles