
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మాబ్యానర్ లొ ఇది 9వ చిత్రం. జర్నలిస్ట్ వినాయక రావు గారి ద్వారా దర్శకుడు నాగు పరిచయమమయ్యాడు. తను విలువైన క్రైమ్ సబ్జెక్ట్ చెప్పాడు. ది బెస్ట్ కాంబొ లొ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. బిచ్చగాడు,డి16 తరహాలొనె విభిన్నమైన చిత్రమిది. ఈ టీమ్ అందరికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నానన్నారు
దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ.. వీకెండ్ లవ్ తరువాత సమయం తీసుకుని, వినాయకరావు గారి ద్వారా ఈ సినిమా చేస్తున్నాను . చదలవాడ శ్రీనివాసరావు గారు నిర్మాతగా పెద్ద బ్యానర్ లొ ఈ చిత్రాన్ని చేస్తున్నాను . కాటెంపరరీ క్రైమ్ కు సంబందించిన కథ ఇది. రియలిస్టిక్ గా గ్రిప్పింగ్ కథనంతో ఈ సినిమా ఉంటుంది. మంచి టీమ్ ఈ సినిమాకు సెట్ అయింది. ఈ నెల 14 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తామన్నారు.
అజయ్ కుమార్ మాట్లాడుతూ. మిత్రులు చదలవాడ శ్రీనివాసరావు గారు యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చెస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్తదనం తో వస్తొన్న ఈ టీమ్ కు మంచి పేరు రావాలని ఆశిస్తున్నానన్నారు.
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. పెద్ద రేంజ్ సినిమాలు చెసె స్థాయి ఉన్నా, కొత్త కాన్సెప్ట్ లను , టాలెంట్ ను ఎంకరేజ్ చెయాలని చదలవాడ శ్రీనివాసరావుగారు ఈ సినిమా చేస్తున్నారు . నాగు దర్శకుడిగా సక్సెస్ కొడతాడన్నారు.
హీరొ వసంత్ సమీర్ మాట్లాడుతూ.. అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు దన్యవాదాలు. మా టీమ్ కు విజయం లభిస్తుందని అశిస్తున్నానన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలొ సెహర్ , రవి వర్మ, శ్రీహర్ష,శ్రావణ్ భరద్వాజ్ తదితరలు పాల్గొన్నారు
వసంత్ సమీర్(తొలి పరిచయం), సెహర్(తొలి పరిచ) , రవివర్మ, శ్రీ హర్ష, జబర్దస్త్ రాం ప్రసాద్ , రఘుబాబు, ,కాదంబరి కిరణ్, నీలిమ, జెమిని సురేష్, కమల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దుర్గా కిషోర్ బొయడపు, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రాఫర్: అనీ,
కాస్టూమ్స్: టి.ఎస్.రావు, కాస్టూమ్స్ డిజైనర్: మంజుల భూపతి, నిర్మాత: చదలవాడ పద్మావతి, రచన- దర్శకత్వం:నాగు గవర.

The post చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం. appeared first on MaaStars.