తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయిన `కావల్` చిత్రాన్ని తెలుగులో `ఇంటిలిజెంట్ పోలీస్` టైటిల్ తో గ్రేహాక్ మీడియా పతాకంపై, వీరబ్రహ్మచారి అన్నభీమోజు సమర్పణలో రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. జె. వి. రామారావు ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ గా వ్వవహరిస్తున్నారు. సముద్రఖని, విమల్, గీత, ఎమ్మెస్. భాస్కర్, సింగమూతు ప్రధాన పాత్రలు పోషించారు. మన్నారా చోప్రా ప్రత్యేక గీతంలో నటించింది. నాగేంద్రన్ ఆర్. దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ జె. వి. రామారావు మాట్లాడుతూ, `తమిళ్ లో పెద్ద విజయం సాధించిన సినిమా ఇది. తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. మంచి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్. ప్రతీ సన్నివేశం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. సముద్రఖని ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో, చాకచక్యం తో ఒక మాఫియా లీడర్ తో ఢీకొనే పోలీస్ గా అద్భుతంగా నటించారు. విమల్ పెర్పామెన్స్ కూడా హైలైట్ గా ఉంటుంది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు ప్రాణం పోసారు. కొన్ని సన్నివేశాలు చాలా వాస్తవికంగా ఉంటాయి. యాక్షన్ సన్నివేశాలు యాక్షన్ ప్రియులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటాయి. మన్నారా చోప్రా ఐటమ్ సాంగ్ యువతను మైమరిపిస్తుంది. యువతకు కావాల్సిన అన్ని మసాలాలు ఆ ఆ పాటలో దొరుకుతాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ యూ ట్యూబ్ లో దూసుకుపోతుంది. మోషన్ పోస్టర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ప్రేక్షకుల నుంచి టీజర్, పోస్టర్ కు మంచి ప్రశంసలు దక్కాయి. సినిమా కూడా తెలుగు ప్రేక్షకులుందరికీ తప్పకుండా నచ్చుతుంది` అని అన్నారు.
ఈ చిత్రానికి స్వర మాంత్రికుడు ఏ.ఆర్ రెహమాన్ మేనల్లుడు జి.వి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
The post త్వరలో `ఇంటిలిజెంట్ పోలీస్`.. `యు` ట్యూబ్ లో దూసుకుపోతున్న టీజర్! appeared first on MaaStars.