నటీనటులు: సాంబ శివ, సంతోషి వర్మ, సుహాష్, అప్పలరాజు, భాను
రచన-దర్శకత్వం-నిర్మాత: శివప్రసాద్ గ్రందె
సంగీతం: నవనీత్
కెమెరా: లక్కీ ఎక్కరి
ఎడిటింగ్: గణేష్ కొమ్మారపు
ముందు మాట:
సినిమాలో చక్కని కథాంశం, ఆకట్టుకునే చిన్నపాటి సందేశం, గ్రిప్పింగ్ నేరేషన్‌తో ఆద్యంతం నడిపించగలిగితే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు ఆదరణ దక్కుతోంది. ఆ కోవలోనే నవతరం ట్యాలెంట్‌కు అవకాశం కల్పించి, వేగ ఎంటర్‌టైన్‌మెంట్-జిఎస్‌కె ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన `నాకథలో నేను` సినిమా ఈ గురువారం థియేటర్లలోకి రిలీజవుతోంది. రెండు రోజుల ముందుగానే ప్రివ్యూ అనంతరం సమీక్ష ఇది.
సింగిల్ లైన్ స్టోరి :
మంచివాడిగా బతకాలంటే చాలా ఓపిక కావాలి. అదే చెడ్డవాడిగా బతకాలంటే మంచితనం మాత్రం వదిలేస్తే చాలు… ట్రైలర్‌లో వినిపించిన ఈ డైలాగ్‌లోనే కథాంశం ఇమిడి ఉంది. లైఫ్ జర్నీలో డబ్బు ఆడించిన ఆటలో మంచి చివరికి ఏమైంది? డబ్బాటలో చివరికి ఎవరు ఎలా ఆడారు? అన్నదే ఈ సినిమాలో అసలు పాయింట్.
సబ్ ప్లాట్:
స్వతహాగా మంచి వాడైన హీరో తనకు లైఫ్‌లో ఎదురైన ఛాలెంజ్‌లో చివరికి ఏం చేశాడు? ఎంతో మంచిది, సహకారి అనుకున్న భార్య వల్ల హీరో ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది? అసలు ఈ కథలో ట్విస్టేంటి? అన్నది తెరపైనే చూడాలి. సాఫ్ట్‌వేర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఆద్యంతం `డబ్బు-కుట్ర- మిస్టరీ` అనే పాయింట్ చుట్టూ కీలకంగా రన్ అవుతుంది.
కథా కమామీషు:
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన సంజయ్ (సాంబ), కిషోర్ (భాను), రాహుల్ (సుహాస్), అభి వీళ్లంతా ఒక గ్యాంగ్. ఆఫీస్‌లో రకరకాల టాస్క్‌లు హ్యాండిల్ చేసే వీళ్లకు అనుకోకుండా ఓ సవాల్ ఎదురవుతుంది. కొలీగ్ చేసిన కుట్రతో బాస్‌కి సబ్‌మిట్ చేయాల్సిన ప్రాజెక్ట్ వర్క్ డిలీట్ అవుతుంది. దాంతో అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ ఇవ్వలేని సన్నివేశం ఎదురవుతుంది. ఆ క్రమంలోనే అమాయకురాలు అనుకున్న ప్రియ (సంతోషి శర్మ) ఆ సమస్యను సాల్వ్ చేసి, ప్రాజెక్ట్ ఇన్‌టైమ్‌లో సబ్‌మిట్ చేసేందుకు భర్త సంజయ్‌కి సాయపడుతుంది. ఓ సందర్భంలో చావుమీదికి వచ్చిన సంజయ్ స్కూల్ మాష్టార్‌ని 5లక్షలు సాయం చేసి బతికిస్తుంది. వేరొక సందర్భంలో యాక్సిడెంట్‌కి గురై తీవ్ర గాయాలతో వచ్చిన భర్తకు పరిచర్యలు చేస్తుంది. ఈ కథ ఇలా రన్ అవుతుండగానే సంజయ్ ఊహించని ఓ పెద్ద చిక్కుల్లో పడతాడు. ఆఫీస్ హెచ్ఆర్ తనని నమ్మి ఇచ్చిన కోటి రూపాయలు పోగొట్టుకోవాల్సొస్తుంది. తాను ఎంతగానో ప్రేమించే భార్య ప్రియను కిడ్నాప్ చేసి దుండగులు బెదిరించడంతో ఆ డబ్బును ఇచ్చేస్తాడు సంజయ్. ఆ క్రమంలోనే పోగొట్టుకున్న డబ్బును వెతుక్కుంటూ వెళ్లిన అతడికి చివరికి ఎలాంటి షాకింగ్ నిజం తెలిసింది? ఈ కథలో భార్య ప్రియ పాత్ర ఏంటి? అసలు ఆ డబ్బు కొట్టేసింది ఎవరు? అన్నది సస్పెన్స్. 8 కోట్ల ఇన్స్యూరెన్స్ డబ్బు కోసం హీరో స్నేహితుడితో కలిసి ఎవరు ఎలాంటి నాటకం ఆడారు అన్నది తెరపైనే చూడాలి.
ప్లస్ పాయింట్స్& పెర్ఫామెన్సెస్:
నేటి ట్రెండుకి తగ్గట్టు డబ్బు -అత్యాశ అనే పాయింట్‌ని ఎంపిక చేసుకుని కథ నడిపించడం సినిమాకి ప్లస్. ఆ క్రమంలోనే ప్రియ పాత్రలో విభిన్నమైన షేడ్స్‌ని ఎలివేట్ చేసే అవకాశం దక్కింది. నాయకానాయికలు సహజంగా ఒదిగిపోయి నటించారు. అలానే స్నేహితుల పాత్రలో కెమిస్ట్రీ వర్కవుటైంది. అయితే ఇలాంటి సీరియస్ నేరేటివ్ సబ్జెక్ట్‌లో కామెడీ పాళ్లు సరిగా కుదరాలి. ఆ విషయంలో రైటింగ్ డిపార్ట్‌మెంట్ వీక్‌నెస్ కనిపిస్తుంది. ఇక సస్పెన్స్ ఎలిమెంట్‌ని ఎలివేట్ చేసిన తీరు మరీ అంత రక్తి కట్టించకపోవడం ఓ మైనస్. దురాశ దుఃఖానికి చేటు.. వినాశనానికి కారణం అని చెప్పిన క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది.
మైనస్ పాయింట్స్ :
సాంకేతికంగా ఈ సినిమాని మరింత బెటర్‌గా తీయాల్సింది. సంగీతం ఓకే. కెమెరా, ఎడిటింగ్ పరమైన లోపాలు కనిపించాయి. అయితే పరిమిత బడ్జెట్ సినిమాలకు ఇలాంటి కష్టాలు తప్పవనే భావించాలి.
టెక్నికల్ విభాగం :
సినిమా కథనం స్లో అయినా రీరికార్డింగ్ తో నడిపించిన తీరు ప్లస్. ఫారిన్ లొకేషన్లు, రిచ్ సాంగ్స్ లేకపోయినా అర్థవంతమైన పాటలు ఆకట్టుకుంటాయి. దర్శకుడిగా తొలి ప్రయత్నం పరిమిత వనరులతో ఓకే అనిపిస్తుంది.
ముగింపు: ఫర్వాలేదనిపించే నా కథలో నేను
రేటింగ్: 2.75 / 5
The post నాకథలో నేను appeared first on MaaStars.