Quantcast
Channel: MaaStars
Viewing all articles
Browse latest Browse all 2793

ఏప్రిల్ 27న ‘ఎవెంజర్స్ –ఇన్ఫినిటీ వార్’

$
0
0

మార్వెల్ స్టూడియోస్ వారి ‘ఎవెంజర్స్ – ఇన్ఫినిటీ వార్’ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సూపర్ హీరోల అందరి కలయిక. మార్వెల్ స్టూడియోస్ 10 సంవత్సరాల ప్రస్థానానికి ‘ఎవెంజర్స్ – ఇన్ఫినిటీ వార్’ ని క్లైమాక్స్ గా చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న విడుద‌ల‌వుతుంది. ఇందులో తెలుగు వెర్షన్ కి సౌత్ స్టార్ హీరో రానా దగ్గుబాటి భాగమ‌య్యారు. రానా ‘ఎవెంజర్స్ – ఇన్ఫినిటీ వార్’ విలన్ తానొస్ కి డబ్బింగ్ చెప్పడం విశేషం. ‘డిస్నీ ఇండియా’ ఈ చిత్రాన్ని ప్రేక్షకులకి మరింత దగ్గిర చేసే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ‘ఎవెంజర్స్ – ఇన్ఫినిటీ వార్స‌ ప్ర‌మోష‌న్స్‌లో రానా ద‌గ్గుబాటి పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా…
రానా దగ్గుబాటి మాట్లాడుతూ, ” నేను మార్వెల్ కామిక్స్ ని చదువుతూనే పెరిగాను. సూపర్ హీరో ల కథలని ఆకట్టుకునేలా, ఎన్నో భాగాలుగా చెప్పడం మార్వెల్ సినిమాల గొప్పదనం. మార్వెల్ తమ పాత్రల్ని సృష్టించడంలో కానీ వాటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులతో కనెక్ట్ చేయడంలో కానీ మార్వెల్ ది తిరుగులేని స్థాయి. ఐరన్ మాన్, కెప్టెన్ అమెరికా నా ఫేవరెట్ కేరక్టర్స్. ‘ఎవెంజర్స్ – ఇన్ఫినిటీ వార్’ కి డబ్బింగ్ చెప్పడం థ్రిల్లింగ్ గా ఉంది. ఎవెంజర్స్ లాంటి సూపర్ హీరోల ని సైతం ముప్పతిప్పలు పెట్టే సూపర్ విలన్ తానొస్ గా వినిపించడం మరిచిపోలేని ఎక్స్పీరియన్స్“ అన్నారు.

10 సంవత్సరాలుగా ప్రణాళికాబద్దంగా భారీ చిత్రాలని నిర్మించుకుంటూ వస్తున్న ‘మార్వెల్ సినెమాటిక్ యూనివర్స్’, ఎవెంజర్స్ – ఇన్ఫినిటీ వార్ చిత్రం తో ఇంతకముందెన్నడు చూడని అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. ఇప్పటి వరకు తమ చిత్రాలన్నింటిలో కనిపించిన సూపర్ హీరో లు అందరూ ప్రపంచ వినాశనానికి పూనుకున్న సూపర్ విలన్ తానొస్ తో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈ అద్భుతం ఏప్రిల్ 27 న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో 2D 3D IMAX 3D ల లో వెండితెర పై ఆవిష్కృతం కానుంది.

The post ఏప్రిల్ 27న ‘ఎవెంజర్స్ – ఇన్ఫినిటీ వార్’ appeared first on MaaStars.


Viewing all articles
Browse latest Browse all 2793

Trending Articles