Quantcast
Channel: MaaStars
Viewing all articles
Browse latest Browse all 2793

మార్చి 23న ప్ర‌పంచ వ్యాప్తంగా ‘రాజరథం’ 

$
0
0
నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్‌ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం ‘రాజరథం’. అంజు వల్లభనేని, విషు దకప్పదారి, సతీష్‌ శాస్త్రి, అజయ్‌రెడ్డి గొల్లపల్లి నిర్మాతలు. మార్చి 23న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో…
సతీశ్‌ శాస్త్రి మాట్లాడుతూ ”యు.ఎస్‌లో డిస్ట్రిబ్యూటర్స్‌గా ఉండి ఎన్నో విజయవంతమైన సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన మా జాలీ హిట్స్‌ సంస్థ నిర్మాణ రంగంలోకి వచ్చింది. అనూప్‌ భండారి దర్శకత్వంలో చేసిన సినిమాలో నిరూప్‌ భండారి హీరోగా నటించారు. సినిమా మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. అజనీశ్‌ లోక్‌నాథ్‌ ఈ సినిమాకు నేపథ్య సంగీతాన్ని అందించారు. మార్చి 23న విడుదలవుతున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలి” అన్నారు.
రామ్‌కుమార్‌ మాట్లాడుతూ ”అందరూ యు.ఎస్‌కు చెందిన నిర్మాతలు. అయయితే సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో మంచి సినిమాలు చేయాలని వచ్చారు. ‘రంగితరంగ’ సినిమాతో ప్రూవ్‌ చేసుకున్న నిరూప్‌ భండారి హీరోగా అవంతిక శెట్టి హీరోయిన్‌గా చేసిన రాజరథం మార్చి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే.. మరిన్ని కొత్త కాన్సెప్ట్‌ సినిమాలు వస్తాయి. సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. రెండేళ్ల పాటు యూనిట్‌ కష్టపడి చేసిన చిత్రమిది. సినిమా కోసం ఇరవై రెండు కోట్ల ఖర్చు పెట్టి ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా చేశాం” అన్నారు.
అవంతిక శెట్టి మాట్లాడుతూ – ”ఒక మంచి సినిమాకు ఉండాల్సిన బెస్ట్‌ క్వాలిటీస్‌ అన్ని ఈ సినిమాలో ఉన్నాయి. మంచి సినిమా కోసం యూనిట్‌ అందరం ఎంతో కష్టపడ్డాం. తప్పకుండా మార్చి 23న రానున్న ఈ సినిమా అందరినీ మెప్పిస్తుంది” అన్నారు.
నిరూప్‌ భండారి మాట్లాడుతూ – ”ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకున్నాను. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. సినిమాలో అభి అనే మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థిగా కనపడతాను. రానాగారు అడగ్గానే వాయిస్‌ ఓవర్‌ అందించారు. అలాగే ఆర్యగారు సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలో నటించారు. నిర్మాతలు ఇచ్చిన సహకారంతో మంచి సినిమాను చేశాం. మార్చి 23న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది” అన్నారు.

The post మార్చి 23న ప్ర‌పంచ వ్యాప్తంగా ‘రాజరథం’  appeared first on MaaStars.


Viewing all articles
Browse latest Browse all 2793

Trending Articles