ఆన్ లైన్ బిజినెస్ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా… ఆయా కంపెనీలకు ధీటుగా, పోటీగా మరో అంకుర సంస్థ వచ్చేసింది. అదే పిక్ ఎన్ హుక్ (https://picknhook.com/). కేవలం 21 సంవత్సరాల వయస్సులో… మోనిష్ పత్తిపాటి ఈ సంస్థను స్థాపించడం విశేషం. పిక్ ఎన్ హుక్ (https://picknhook.com/) సంస్థ ప్రమోషన్లో భాగంగా చందమామ కథలు, ఢీ10 ఫేమ్ వర్షిని సౌందరాజన్ విశాఖ గైట్ క్యాంపస్ లో విద్యార్థులతో కలిసి సందడి చేశారు. జబర్దస్త్ ఫేం ఫణీంద్రతో కలిసి పిక్ ఎన్ హుక్ సంస్థ విశేషాల్ని విద్యార్థులతో కలిసి పంచుకున్నారు. పిక్ ఎన్ హుక్ యాప్ యొక్క ప్రత్యేకత, ఆఫర్స్ మరియు మిగతా యాప్స్ లోని వ్యత్యాసాల గురించి పలు ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగగా సీఈఓ మోనిష్ వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత గైట్ కళాశాల ప్రిన్సిపాల్ రామమూర్తితో కలిసి పిక్ ఎన్ హుక్ యాప్ కు సంబంధించిన విశేషాల గురించి చర్చించారు. మొదటిసారిగా ఆన్ లైన్ షాపింగ్ యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో విశిష్టత పొందిన కొండపల్లి బొమ్మలను చేరడం పట్ల సిఇఓ మోనిష్ ను ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా పిక్ ఎన్ హుక్ (https://picknhook.com/) సీఈఓ మోనీష్ పత్తిపాటి మాట్లాడుతూ… విశాఖ నుంచి తమ యాప్ ప్రమోషనల్ టూర్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. పిక్ ఎన్ హుక్ యాప్ ను అందరినీ సంతృప్తి పరిచే విధంగా రూపొందించడం జరిగింది. అమోజాన్, ఫ్లిప్ కార్ట్ లకు పోటీగా నిలుస్తాం. అప్ డేటెడ్ టెక్నాలజీతో, యూజర్ అండ్ కస్టమర్ ఫ్రెండ్లీగా వెబ్ సైట్ రూపొందించడం జరిగింది. క్యూఏ టెస్ట్ పాసైన అన్ని రకాల బ్రాండెడ్ వస్తువులు ఈ పోర్టల్ లో అందుబాటులో ఉంటాయి. ప్రమోషనల్ కార్యక్రమాల్ని వినూత్నంగా చేస్తున్నాం. కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, భీమవరం, విజయవాడ, ఒంగోలు తదితర ప్రాంతాల్లోనూ మా యాప్ ను ప్రచారం చేయబోతున్నాం. ఒంగోలు కేంద్రంగా మా వ్యాపార కార్యకలాపాలు జరుగుతాయి. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ల ద్వారా పిక్ ఎన్ హుక్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. అని అన్నారు.
The post మోనిష్ పత్తిపాటి “పిక్ ఎన్ హుక్” (https://picknhook.com/) యాప్ ప్రమోషన్లో సందడి చేసిన హీరోయిన్ వర్షిని appeared first on MaaStars.