ముందుమాట: సతీష్ రెడ్డి , మౌర్యానీ , ముంతాజ్ హీరో హీరోయిన్ లుగా విజే రెడ్డి దర్శకత్వంలో రఘునాథ రెడ్డి నిర్మించిన చిత్రం ” నెల్లూరి పెద్దారెడ్డి ”. ప్రభాస్ శ్రీను , అంబటి శ్రీను , సమ్మెట గాంధీ తదితరులు నటించిన ఈ చిత్రం ఈరోజు విడుదల అయ్యింది . మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .
కథ :
గ్రామానికి సర్పంచ్ అయిన నెల్లూరి పెద్దారెడ్డి ( సతీష్ రెడ్డి ) అంటే గ్రామ ప్రజలకు విపరీతమైన అభిమానం అయితే గ్రామం అంతా గౌరవంగా చూసే నెల్లూరి పెద్దారెడ్డి కి భార్య (ముంతాజ్ ) అంటే అస్సలు ఇష్టం ఉండదు . దాంతో ఆమె పెద్దారెడ్డి పట్ల కోపంతో రగిలిపోతుంటుంది . సరిగ్గా అదే సమయంలో నెల్లూరు పెద్దారెడ్డి కి మీనాక్షి (మౌర్యాని ) పరిచయం అవుతుంది . ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది . ఈ విషయం పెద్దారెడ్డి భార్య ముంతాజ్ కు తెలియడంతో మీనాక్షి ని చంపించడానికి పన్నాగం పన్నుతుంది . అసలు నెల్లూరి పెద్దారెడ్డి కి భార్య ముంతాజ్ కు ఉన్న గొడవ ఏంటి ? మీనాక్షి పై ఎందుకు మనసు పారేసుకున్నాడు ? ముంతాజ్ కుట్ర నుండి మీనాక్షి ని ఎలా కాపాడాడు ? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే .
నటీనటుల పనితీరు:
నెల్లూరి పెద్దారెడ్డి పాత్రలో సతీష్ రెడ్డి రాణించాడు . గ్రామపెద్ద గా , భార్య పై అసహనం వ్యక్తం చేసే పాత్రలో అలాగే మీనాక్షి పట్ల ప్రేమని చూపించే పాత్రలో యాక్షన్ సన్నివేశాల్లో కూడా బాగానే మెప్పించాడు . హీరోయిన్ లు మౌర్యానీ , ముంతాజ్ లు తమతమ పాత్రలకు న్యాయం చేసారు . ఇక ప్రభాస్ శ్రీను , అంబటి శ్రీను నవ్వించడమే కాకుండా విలనిజాన్ని మెప్పించారు . సమ్మెట గాంధీ తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు .
సాంకేతిక వర్గం పనితీరు:
బాలసుబ్రమణి అందించిన ఛాయాగ్రహణం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . గ్రామీణ అందాలను తన కెమెరాలో బందించి మంచి విజువల్స్ ని అందించాడు . అలాగే గురు రాజ్ సంగీతం కూడా ఫరవాలేదు . నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు విజే రెడ్డి విషయానికి వస్తే మంచి కథనే ఎంచుకున్నప్పటికీ స్క్రీన్ ప్లే పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే మరింతగా బాగుండేది .
హైలెట్స్ :
పచ్చని గ్రామీణ వాతావరణం
ఛాయాగ్రహణం
సతీష్ రెడ్డి నటన
డ్రా బ్యాక్స్ :
స్క్రీన్ ప్లే
చివరిగా: పెద్దా రెడ్డి పర్వాలేదు
రేటింగ్:2/5
The post నెల్లూరి పెద్దారెడ్డి appeared first on MaaStars.