Quantcast
Channel: MaaStars
Viewing all articles
Browse latest Browse all 2793

సుమంత్ తో `ఇదం జ‌గ‌త్`?

$
0
0

`మ‌ళ్లీ రావా` స‌క్సెస్ తో సుమంత్ మ‌ళ్లీ ఫేమ్ లోకి వ‌చ్చాడు. ఈ విజయం ఆయ‌న‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. స్టార్ గా మ‌ళ్లీ బిజీ అవుతున్నాడు. ప్ర‌స్తుతం అనీల్ శ్రీకంఠం అనే ద‌ర్శ‌కుడితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఇందులో సుమంత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. గ‌తంలో సుమంత్ ఎప్పుడూ ఇలాంటి క్యారెక్ట‌ర్ చ‌య‌క‌పోవ‌డంతో సినిమా కొత్త‌గా ఉంటుంద‌నే అంచ‌నాలు మొద‌ల‌య్యాయి.

తాజాగా ఈ సినిమాకు `ఇదం జగత్’ అనే డిఫరెంట్ టైటిల్ ను ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆసక్తికరమైన బ్యాక్ డ్రాప్లో ఉండబోయే ఈ సినిమాతో మలయాళీ నటి అంజు కురియన్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

The post సుమంత్ తో `ఇదం జ‌గ‌త్`? appeared first on MaaStars.


Viewing all articles
Browse latest Browse all 2793

Trending Articles