ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వితీయ ఉగాది సినిమా పురస్కారాల్లో భాగంగా షార్ట్ ఫిల్మ్ పోటీని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఏపి ఎఫ్‌డిసి చైర్మన్ అంబికా కృష్ణ విజయవాడలో ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం ఎంతో సహకారాలు అందిస్తోందని ఈ సందర్భంగా అంబికా కృష్ణ పేర్కొన్నారు. కేవలం సినిమాలకే కాకుండా షార్ట్ ఫిల్మ్‌లకు కూడా అవార్డులు ఇవ్వడం హర్షించదగిన పరిణామం అన్నారు. షార్ట్ ఫిల్మ్ కళాకారులకు సినిమాల్లో మంచి ప్రోత్సాహం లభిస్తోందన్నారు.
ఛాంబర్ అధ్యక్షుడు ఆర్.వి.భూపాల్ ప్రసాద్ అవార్డుల కోసం ప్రత్యేకంగా కమిటీ వేశామని తెలిపారు. ఛాంబర్ సెక్రటరి జేవీ. మోహన్ గౌడ్ మాట్లాడుతూ అవార్డు పొందిన వారి వివరాలను త్వరలో వెల్లడిస్తాం. జ్యూరీ సభ్యులుగా తమ్మారెడ్డి భరద్వాజ, ఎస్వీ.కృష్ణారెడ్డి, ఎంవీ.రఘు, ఆర్.పి.పట్నాయక్, శ్రేష్ట ఉంటారని, మొత్తం మూడు బహుమతులు అందజేస్తామని చెప్పారు. మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులుగా 50 వేలు, 30 వేలు, 20 వేలు షీల్డులతో పాటుగా అందజేస్తామని చెప్పారు.
The post ఏపీలో షార్ట్ ఫిలిం పోటీలు appeared first on MaaStars.