మాటల మాంత్రికుడు ,దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు.చిత్రం టీజర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ @pkcreativeworks ఖాతా ద్వారా ఈ రోజు ఉదయం 9 గంటలకు విడుదల చేసి చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు.’ఛల్ మోహన్ రంగ’ టీజర్ కు లభిస్తున్న స్పందన ఎంతో సంతోషంగా ఉందని హీరో నితిన్ తన స్పందనను సోషల్ మీడియా వేదికగా కృతఙ్ఞతలు తెలుపుతున్నారు.
శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణ లో ప్రముఖ నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య దర్శకత్వం లో నిర్మిస్తున్నారు.హైదరాబాద్, ఊటీ, అమెరికాలలో ఇప్పటివరకు షూటింగ్ జరుపుకుందీ ఈ చిత్రం.
‘ఛల్ మోహన్ రంగ’ చిత్రానికి సంబంధించి ఆఖరి పాట చిత్రీకరణ ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభమయింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధ్హాకర్ రెడ్డి మాట్లాడుతూ.. హీరో నితిన్ పై ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది.శేఖర్ ఈ పాటకు నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఏప్రిల్ 5 న చిత్రం విడుదల కానుందని తెలిపారు. చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ..’ ప్రేమతో కూడిన కుటుంబ కధా చిత్రం ఇది. చాలా సరదాగా సాగుతుంది అని తెలిపారు
The post ఛల్ మోహన్ రంగ టీజర్ విడుదల appeared first on MaaStars.