గరుడవేగ` హిట్ తో ప్రవీణ్ సత్తారు పేరు టాలీవుడ్ అంతటా మారు మ్రోగిపోయింది. జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన సినిమా సైతం ఇవ్వని పేరు ప్రఖ్యాతల్ని ఒక్క కమర్శియల్ హిట్ తేగలింది. ఇప్పుడు హీరోలంతా ఆయన వెంటపడుతున్నారు. తాజాగా ప్రవీణ్ సత్తారు ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇటీవలే రామ్ కు కథ వినిపించి ఒకే చేయించుకున్నాడుట.
ఇదొక డిఫరెంట్ స్టోరీ అని టాక్. రామ్ ని కొత్త కోణంలో చూపించనున్నాడని అంటున్నారు. కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటూనే కమర్శియల్ గానే వర్కౌట్ అయ్యేలా ప్లాన్ చేశాడని తెలిసింది. ఈ చిత్రాన్ని భవ్యక్రియేషన్స్ నిర్మిస్తుందట. ఇప్పటికే హీరో, డైరెక్టర్లకు అడ్వాన్స్ లు కూడా ఇచ్చేసిందని సమాచారం. ప్రస్తుతం ప్రవీణ్ కథకు సంబంధించి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నట్లు సమాచారం. అతి త్వరలోనే సినిమాకు సంబంధిచిన వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయట.
The post రామ్ తో ప్రవీణ్ సత్తారు మూవీ appeared first on MaaStars.