
దర్శకుడు అజయ్ అండ్రూస్ మాట్లాడుతూ – “ఈ సినిమా కోసం మనోజ్‌తో ఏడాదిన్నరగా ట్రావెల్ అవుతున్నారు. ఇప్పటి వరకు తెలుగు సినిమాలో రాని కంటెంట్. హింస- అహింస అనే రెండు విషయాలను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాం. మన ఇంట్లో వచ్చి ఎవరైనా దౌర్జన్యం చేస్తే అప్పుడు మనమెలా రియాక్ట్ అవుతామనేదే అసలు ఫీలింగ్. ఒక దేశం, రాష్ట్రం, కుటుంబంలో పెద్ద ఫెయిల్ అయితే దాని ప్రభావం ఆ సమాజం లేదా కుటుంబంపై ఎలా ప్రభావం చూపుతుందనేదే ఈ కథ. ఈ 21వ శతాబ్దంలో జరిగిన వివిధ మారణహోమాలు కారణంగా చనిపోయిన వారి సంఖ్య ఇవరై శతాబ్దాలుగా చనిపోయిన వారి సంఖ్య కంటే చాలా ఎక్కువ. ఇవన్నీ చూస్తుంటే మనం ఎటు వెళుతున్నామనిపిస్తుంది. శరణార్థులు సంఖ్య పెరిగిపోతున్నారు. ప్రపంచచంలో ఇప్పటి వరకు 16 లక్షల మంది శరణార్థులు ఉన్నారు. ఆస్ట్రేలియా జనాభా కంటే ఎక్కువ. పాకిస్థాన్, అప్ఘనిస్థాన్, భూటాన్, శ్రీలంక దేశస్థులందరూ మన అన్మదమ్ములే. కానీ అన్ని దేశాలు ప్రశాంతంగా ఉంటున్నాయి. అందరూ చేస్తున్న మారణహోమాలు ఇక్కడితో ఆగిపోవు. 21వ శతాబ్దమైనా మనిషి ఆకలి కోసం, మనుగడ కోసం పోరాడుతూనే ఉన్నాడు. ఓ నాయకుడు పోరాడుతున్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని చూపుతాయనేదే ఈ సినిమా. సామాన్యులు అణగదొక్కబడ్డ ప్రతిసారి వారి నుండి ఓ నాయకుడు పుడతాడు. అతను ఏ మార్గం ఎంచుకుంటూ అనేది పరిస్థితి బట్టి ఉంటుంది. అలాంటి కథే ఒక్కడు మిగిలాడు. ఈ సినిమా కోసం మనోజ్ చాలా కష్టపడ్డాడు. పాత్ర కోసం 20 కిలోలు పెరిగాడు. 10 కిలోలు తగ్గాడు. నిర్మాతగారు ఎంతో సపోర్ట్ చేశారు. సినిమాను సెప్టెంబర్ 8న విడుదల చేస్తున్నారు. సినిమా చాలా వండర్‌ఫుల్‌గా వచ్చింది“ అన్నారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ – “సినిమాలో రెండు పాత్రలను నేను చేయగలను నమ్మి నాతో సినిమా చేసిన దర్శకుడు అజయ్‌కు, నిర్మాతలకు థాంక్స్. సహకారం అందించిన శివ నందిగామ, వి.కోదండ రామరాజు సహా ప్రతి ఒక టెక్నిషియన్, ఆర్టిస్ట్‌కు థాంక్స్“ అన్నారు.
The post ఒక్కడు మిగిలాడు ట్రైలర్ ఆవిష్కరణ appeared first on MaaStars.