హీరోయిన్లలో ఎవరికైనా ఇంత ఫాలోయింగ్ ఉంటుందా? ఇసుక వేస్తే రాలనంత జనం ఏ హీరోయిన్ కోసమైనా వచ్చారా? అంటే ఇకపై ఠక్కున గుర్తొచ్చే ఒకే ఒక్కపేరు సన్నీలియోన్. స్టార్ హీరోను చూడటానికి ఎలా ఎగబడతారో? కేరళ లో సన్నీ ని చూడటం కోసం లాఠీ దెబ్బలను సైతం లెక్క చేయకుండా ఎగబడ్డారు. అసలైన అభిమానం ఇది గాక ఇంకేటి?
అమ్మ డు కేరళలో ఓ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడికి ఆమెను చూడటానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలనంత మంది జనం వచ్చారంటే అతిశయోక్తి కాదు. దీంతో ట్రాఫిక్‌కి అంతరాయం కల్గింది. ఈ సందర్భంగా సన్నీ ట్విటర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. కొచ్చి ప్రజలకు ధన్యవాదాలు చెప్పడానికి మాటలు సరిపోవన్నారు. కేరళను ఎప్పటికీ మ ర్చిపోను. నా కారు నిజంగా కొచ్చిలోని ప్రేమ అనే సముద్రంలో మునిగిపోయిందని ట్వీట్ చేసింది. దటీజ్ సన్నీలియోన్.
The post సన్నీలియోన్ నా..మజాకా! appeared first on MaaStars.