2002 సంవత్సరంలో `సంతోషం` సినీ మ్యాగజైన్ కు తొలి అడుగు పడింది. తొలి వార్షికోత్సవం అత్యంత వైభంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా..లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు సమక్షంలో `సంతోషం` తొలి పుస్తకం ఆవిష్కృతమైంది. తర్వాత హేమా హేమీల చేతుల మీదుగా `సంతోషం` అలా..అలా చేతులు మారింది. కవర్ పేజీ అదిరింది. ఇంకేముంది సంతోషం తొలి పుస్తకాన్ని నేనే కొంటానంటూ హాస్య చిత్రాల దర్శకుడు ఈ.వి.వి. సత్యనారాయణ ముందుకొచ్చారు. అప్పట్లోనే 500 రూపాయలను వెచ్చించి తొలి `సంతోషం`ను సొంతం చేసుకున్నారు. ఈ తొలి వార్షికోత్సవానికి సుమ, సునీత వ్యాఖ్యతలగా వ్వవహరించారు.
కాగా కాగా 16వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ వేడుక వచ్చే నెల( ఆగస్టు)లో ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే.
The post సంతోషం మధుర జ్ఞాపకాలు appeared first on MaaStars.