Quantcast
Channel: MaaStars
Viewing all articles
Browse latest Browse all 2793

జూలై నెలాఖరున “కథలో రాజకుమారి”

$
0
0

Actor Nara Rohith in Kathalo Rajakumari Movie Stills
వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ, హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న యంగ్‌ హీరో నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం “కథలో రాజకుమారి”. శిరువూరి రాజేష్‌వర్మ సమర్పణలో మాగ్నస్‌ సినీప్రైమ్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సౌందర్య నర్రా, ప్రశాంతి , శుధాకర్ రెడ్డి, కృష్ణవిజయ్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగశౌర్య మరో కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నమిత ప్రమోద్, నందితలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా మహేష్‌ సూరపనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా, విశాల్ చంద్రశేఖర్ లు సంగీత సారధ్యం వహించిన పాటలు ఇటీవల ఆన్ లైన్ ద్వారా విడుదల చేయగా శ్రోతల నుండి విశేషమైన స్పందన లభించింది. అదే విధంగా.. టీజర్-ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకొంది. తొలుత ఈ చిత్రాన్ని జూన్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేసినప్పటికీ.. సినిమా అందరికీ చేరువవ్వాలన్న ఆలోచనతో.. “కథలో రాజకుమారి” చిత్రాన్ని జూలై నెలాఖరుకు విడుదల చేయనున్నట్లు దర్శకనిర్మాతలు తెలిపారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. “పరిణతి చెందిన ఓ జంట మధ్య జరిగే భావోద్వేగాలతో కూడుకున్న ప్రేమకథా చిత్రం ‘కథలో రాజకుమారి’. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన మా చిత్రాన్ని జూన్ లో విడుదల చేద్దామనుకొన్నాం. కానీ.. జూలై నెలాఖరుకు విడుదలను వాయిదా వేయడం జరిగింది. సినిమా ఎక్కువమంది జనాలకు చేరాలన్న ఆలోచనతోనే సినిమాను జూలై నెలాఖరుకు వాయిదా వేయడం జరిగింది” అన్నారు.

The post జూలై నెలాఖరున “కథలో రాజకుమారి” appeared first on MaaStars.


Viewing all articles
Browse latest Browse all 2793

Trending Articles