టాలీవుడ్ కు ఉవ్వెత్తున దూసుకొచ్చింది ముంభై బ్యూటీ పూజాహెగ్దే. ఆరంభమే అక్కినేని వారసుడు నాగచైతన్య సరసన `ఒక లైలా కోసం` లో ప్రేమంటే గిట్టని పాత్రతో తెలుగు ఆడియన్స్ ను మెప్పించింది. అటు మెగా హీరో వరుణ్ తేజ్ తో `ముకుంద`లో రొమాన్స్ చేసింది. అయితే తర్వాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన `మొహంజదారో` లో ఛాన్స్ రావడంతో అటుపై ఓ లుక్ వేసింది గానీ కలసి రాకపోవడంతో మళ్లీ ఇక్కడికే వచ్చేసింది.
ఇటీవలే ఆమె కథానాయికగా నటించిన `దువ్వాడ జగన్నాథమ్` ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్ టాక్ తో సినిమా రన్ అవుతోంది. అయితే తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతోన్న `భరత్ అను నేను`లో ఈ అమ్మడే హీరోయిన్ దాదాపు కన్ఫమ్ అయిపోయింది. ఈవిషయం పై పూజా కూడా సానుకూలంగా స్పందించింది.
The post మహేష్ సరసన డీజే బ్యూటీ appeared first on MaaStars.