కలెక్షిన్ కింగ్ మోహన్ బాబు డైరెక్ట్ కాబోతున్నారా? అదీ కొడుకు సినిమాతో ఆయన మెగా ఫోన్ పట్టబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇప్పటికే కలెక్షిన్ కింగ్ హీరోగా, నిర్మాతగా రాణిస్తున్నారు. తాజాగా ఆయన మనసు సృజనాత్మక వైపు కూడా మళ్లిందని తెలుస్తోంది. ఆయన దర్శకత్వంలో పెద్ద కొడుకు విష్ణు హీరోగా ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కథే ఎలాంటిదన్ని ఆరా తీయగా `కన్నప్ప` స్టోరీ అని తెలిసింది. ఈ స్టోరీ ఇప్పటికే మంచు కాంపౌండ్ లాక్ అయి ఉన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేస్తున్నార్ట. 2018 ప్రధమార్థంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నదని తెలుస్తోంది. ‘కన్నప్ప’లో మోహన్ బాబు శివుడిగానూ కనిపించబోతున్నారుట. ఈ చిత్రాన్ని దాదాపుగా అన్ని భారతీయ భాషల్లోనూ విడుదల చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.![]()

The post తండ్రి డైరెక్షన్..కొడుకు యాక్షన్! appeared first on MaaStars.