మాస్టార్స్.కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకత్వం : హరీశ్ శంకర్
నిర్మాత : దిల్ రాజు
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు : అల్లు అర్జున్, పూజ హెగ్డే
ముందుమాట:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరుసగా సక్సెస్ లు అందుకుంటూ స్టార్ ఇమేజ్ ను మరింత పెంచుకుంటున్నాడు. అటు యూత్ ను..ఇటు కుటుంబ ప్రేక్షకులను మెప్పించే కథలనే ఎంపిక చేసుకుంటూ అన్ని వర్గాల ప్రేక్షకులకు మరింత ఆకట్టుకుంటున్నాడు. దీంతో ఆయన కథానాయకుడి నటించిన `డీజె దువ్వాడ జగన్నాథమ్` పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఆ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కథా కమామీషు ఏంటో ఓసారి చూద్దాం.
కథ:
విజయవాడ సమీపంలోని సత్యానారయణ పురంలో బ్రహ్మణ కుటుంబంలో పుట్టినవాడు దువ్వాడ జగన్నాథమ్ శాస్ర్తి( అల్లు అర్జున్). చేయి తెరిగిన మంచి వండకాడు. చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో శాస్ర్తి వంటలు ఎంతో ఫేమస్. ఈ క్రమంలోనే అనుకోకుండా పూజా ( పూజా హెగ్దే) తో పరిచయం ఏర్పడుతుంది. తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే శాస్ర్తిలో మరో యాంగిల్ కూడా ఉంటుంది. తప్పు చేసిన వాడు ఎవడైనా వదిలిపెట్టకుండా చంపేస్తుంటాడు? మరి ఎలాంటి పరిస్థితుల్లో శాస్ర్తి డీజె గా మారాడా? రొయ్యల నాయుడు (రావు రమేష్) తో వివాదం రావడానికి కారణం ఏంటి? మరి రొయ్యల నాయుడుని ఎలా హతమర్చాడు? పూజ శాస్ర్తిని ప్రేమించిందా? లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎనాలసిస్:
ఇది రొటిన్ కథలు కాస్త భిన్నంగా ఉన్న రివేంజ్ స్టోరీ. హీరోయిజం..విలనిజం కథలో సమపాళ్లలో ఉంటుంది. చిన్నప్పుడే తండ్రిని కొట్టిన వాడిపై పగ..అటుపై సామాన్య జనానికి ఆపద వస్తే ఎంతకైనా తెగించే మనస్థత్వం క్యారెక్టర్ లో డీజే కనిపిస్తాడు. అయితే ప్రధమార్థం కథను పూర్తిగా వినోదంతో చెప్పాడు దర్శకుడు. బన్ని కి ఇదొక డిఫరెంట్ క్యారెక్టర్ అనొచ్చు. గతంలో ఎన్టీఆర్ అదుర్స్ లో కూడా శాస్ర్తి తరహా పాత్ర పోషించాడు. కానీ ఎవరి స్పెషాలిటీ వారుకుంటుందన్నట్లు హరీష్ బన్ని పాత్రను చక్కగా డిజైన్ చేశాడు. ఇక డీజె గా కూడా బన్ని బాగా చూపించాడు. ఒకే పాత్రలో రెండు వేరియషన్స్ ను బన్ని చక్కగా పండిచాడు. అయితే టైటిల్ ఇంటర్ డక్షన్ లో నే ఆ పాత్ర తీరు తెన్నులను రివీల్ చేయడంతో.. కథలోకి వెళ్లే కొద్ది పాత పాయింట్ నే మళ్లీ చూపిస్తున్నాడు అనే భావన కల్గుతుంది. చిట్ ఫండ్ కంపెనీ పేరుతో ప్రజల సొమ్మును దొచేసిన దొంగబాబులను బేస్ చేసుకున్న లైన్ కన్వెన్సింగ్ గా చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ అంతా వినోదం, రొమాన్స్…యాక్షన్ సన్నివేశాలతో ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. ఇక ద్వితియార్థం వచ్చే సరికి కథ పూర్తిగా రివేంజ్ లోకి వెళ్లిపోతుంది. ప్రతి నాయకుడిని మట్టు బెట్టడం కోసం డీజె చేసిన పోరాటలు షరా మామూలుగా ఉంటాయి. హీరో-విలన్ మధ్య ఇంట్రెస్టింగ్ థ్రిల్ కు గురయ్యే అంశాలేవి ఉండవు. కథను కథగానే చెప్పాడు. కథనం ఆసక్తికరంగా అనిపించలేదు. రావు రమేష్ పాత్రను..తన తండ్రి రావుగోపాలరావు పాత్రతో ఇమిటేట్ చేయించాడు. అతని ఆహార్యం..నడవడిక అన్ని రావుగోపాలరావును తలపించాయి. ఆ పాత్ర సినిమాకు హైలైట్ గా ఉంటుంది. ఓవరాల్ గా ఈ అగ్రహారం డీజే కొంచెం కొత్తగానే ఉన్నాడు.
నటీనటుల పనితీరు:
శాస్ర్తి, డీజె పాత్రలో బన్ని ఒదిగిపోయాడు. ముఖ్యంగా శాస్ర్తి పాత్ర కు ప్రాణం పోశాడు. బన్నితొలిసారి డిఫరెంట్ ఎటెంప్ట్ చేసి బాగా ఆకట్టుకున్నాడు. పూజా హెగ్దే నటన బాగుంది. సాధారణంగా ఇప్పటి సినిమాల్లో హీరోయిన్లకు సీన్స్ తక్కువ ఉంటాయి. కానీ దర్శకుడు హరీష్ శంకర్ పూజా కు మంచి క్యారెక్టర్ డిజైన్ చేశాడు. ఇక రొయ్యల నాయుడు పాత్రకు రావు రమేష్ జీవం పోశాడు. అతని ఆహార్యం..నటన అన్నీ రావు గోపాలరావును తలపించాయి. మితగా పాత్రలు తమ ఫరిది మేరకు న్యాయం చేశాయి.
సాంకేతిక వర్గం పనితీరు:
దర్శకుడు హరీష్ శంకర్ మాటలు బాగా రాసుకున్నాడు. తన అనుకున్న కథకు ఒక ఫార్ములా ప్రకారం వెళ్లి మాటలు రాశాడు. నటీనటుల నుంచి మంచి పెర్పామెన్స్ రాబట్టుకున్నాడు. ముఖ్యంగా బన్ని తెరపై చక్కగా చూపించాడు. ఇక కెమెరా, ఎడిటింగ్ బాగుంది. కాకపోతే సినిమా నిడివి ఎక్కుగా ఉంది. కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేయాల్సింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. ముఖ్యంగా గుడిలో మడిలో సాంగ్ హైలైట్ గా నిలిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరిగా: ఎవరేజ్ డీజే
The post దువ్వాడ జగన్నాథమ్` సినిమా సమీక్ష I appeared first on MaaStars.