శ్రీలత సినీ క్రియేషన్స్ పతాకం పై శ్రీలత నిర్మిస్తున్న `కాలేజ్ డేస్` చిత్రం బుధవారం ఉదయం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. నిర్మాత శివకుమార్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, తెలంగాణ రాష్ర్ట మంత్రి పట్నం మహీందర్ రెడ్డి స్ర్కిప్ట్ ను అందించారు. శివరాజ్ పాటిల్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నూతన తారలతో తెరెక్కుతోన్న ఈ చిత్రానికి రజనీకాంత్ ఎన్నా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పట్నం మహీందర్ రెడ్డి మాట్లాడుతూ, ` రెండు తెలుగు రాష్ర్టాల బ్యాక్ డ్రాప్ లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హ్యాపీ డేస్ చిత్రంలా ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలి` అని అన్నారు.
దర్శకుడు రజనీకాంత్ ఎన్నా మాట్లాడుతూ, ` దర్శకడు క్రిష్ వద్ద కొన్ని సీరియల్స్ కు అసోసియేట్ గా పనిచేశాను. ఆ అనుభవంతోనే ఇప్పుడు డైరెక్టర్ గా టర్న్ అవుతున్నారు. కాలేజ్ లవ్ స్టోరీ అంటే ఈ కథ ప్రేమకు సంబంధించిందో..రొమాన్స్ కు చెందినదో అనుకుంటారు. కానీ మా సినిమా ఈ రెండు పాయింట్లకు భిన్నంగా ఉంటుంది. తెలుగు రాష్ర్టాలను మిళితం చేస్తూ చక్కని సందేశాత్మకంగా చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. జులైలో సినిమా రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. సింగిల్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తిచేసి డిసెంబర్ నెలాఖరుకల్లా సినిమా విడుదల చేస్తాం. ఇందులో ఇందులో సాక్షి కక్కర్ హీరోయిన్ గానటిస్తోంది. మా సినిమాను ప్రేక్షకులంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా` అని అన్నారు.
చిత్ర నిర్మాత శ్రీలత మాట్లాడుతూ, ` చక్కని కథాంశమిది. అన్ని వర్గాలు వారి చూడదగ్గ సినిమా. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి సినిమా విడుదల చేస్తాం` అని అన్నారు.
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ, ` మా సురక్ష బ్యానర్ లో పనిచేసిన వారు ఇప్పుడు సినిమా చేయడం ఆనందంగా ఉంది. అదీ కొత్త వాళ్లను ప్రోత్సహిస్తు దర్శక, నిర్మాతలు సినిమా చేస్తున్నారు. వాళ్ల ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుంది. మంచి సందేశాత్మక కథ ఇది. తెలుగు ప్రేక్షకులంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా` అని అన్నారు.

The post `కాలేజ్ డేస్` ప్రారంభం appeared first on MaaStars.