ప్రిన్స్ మహేష్ బాబు-మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `స్పైడర్`. మహేష్ తొలిసారి ఇంటిలిజెన్స్ అధికారి పాత్రలో కనిపించడం…అదీ మురగదాస్ డీల్ చేయడంతో సినిమా పై అంచనాలు స్కైని టచ్ చేస్తున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్..పోస్టర్స్ మార్కెట్ లో బోలెడంత క్రేజ్ వచ్చేసింది. షూటింగ్ పూర్తికాకుండానే సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతోంది. అయితే తాజాగా క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయిందని సమాచారం.
చెన్నైలో వేసిన భారీ సెట్ లో కొన్ని రోజుల నుంచి షూటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఆ సన్నివేశాలు షూటింగ్ పూర్తయిందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇక రెండు పాటలు మాత్రమే బాలెన్స్ ఉన్నాయట. వాటిని త్వరలోనే పూర్తిచేసి అనుకున్న తేదికి సినిమా రిలీజ్ చేయడం షురూ అని అంటున్నారు. ఈ చిత్రాన్ని ఎన్. వి. ప్రసాద్, ఠాగూరు మధు నిర్మిస్తున్నారు.
The post `స్పైడర్` క్లైమాక్స్ ఫినిష్! appeared first on MaaStars.