
ఇది కూడా పూర్తిగా పొలిటికల్ స్టోరీనే. దీంతో ఈ సినిమా లీడర్ కు సీక్వెల్ లా ఉండబోతుందని ఓ ప్రక్క ప్రచారం సాగుతోంది. తాజాగా సినిమాకు సంబంధించిన మరో అప్ డేట్ ను రానా ట్విట్టర్ ద్వారా తెలిపాడు. జూన్ 6న టీజర్ ను రిలీజ్ చేస్తున్నామని ప్రకటించాడు. ఆ రోజు ఇది లీడర్ కు సీక్వెల్ నా? లేక మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ తో తెరకెక్కుతుందా? అన్న విషయం తేలిపోనుంది. ఈ చిత్రాన్ని సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్, కేథరిన్ ట్రెసా, నవదీప్, అశుతోష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
The post జూన్ 6న రాజుగారి గుట్టు తెలిసిపోద్ది appeared first on MaaStars.