విశ్వనటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన `ఉత్తమ విలన్` సినిమా ఆయన కెరీర్ లో చెప్పుకోదగ్గ మరో మూవీ. ఇందులో కమల్ విభిన్నమైన కోణాల్లో అద్భుతంగా ఆవిష్కరించారు. కమర్శియల్ గా సినిమా ఎలా ఉన్నప్పటికి కమల్ కెరీర్ కు కీలకమైన సినిమాగా చెప్పవచ్చు. అయితే ఈ మూవీ ఇప్పుడు హాలీవుడ్ రీమేక్ కు రెడీ అవుతోంది.
హాలీవుడ్ లో ‘హీరో’ పేరుతో రీమేక్ చేసినట్టుగా సమాచారం. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ప్రస్తుతం కమల్ విశ్వరూపం-2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అలాగే అటు శభాష్ నాయుడు సినిమా షూటింగ్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.
The post హాలీవుడ్ కు ఉత్తమ విలన్! appeared first on MaaStars.