చిత్రం: బాబు బాగా బిజీ
తారాగణం: అవసరాల శ్రీనివాస్, మిస్తీ చక్రవర్తి, శ్రీముఖి, ప్రియాంక ఐసోల, తేజస్వి మదివాడ, తనికెళ్ల భరణి, ప్రియదర్శి, పోసాని కృష్ణమురళి, సుధ, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు
సాంకేతికవర్గం: ఛాయాగ్రహణం: సురేష్ భార్గవ, సంగీతం: సునీల్ కశ్యప్, మాటలు: మిర్చి కిరణ్, కూర్పు: ఎస్.బి.ఉద్ధవ్, నిర్మాత: అభిషేక్ నామా, దర్శకత్వం: నవీన్ మేడారం.
నిర్మాణ సంస్థ: అభిషేక్ పిక్చర్స్
మాస్టార్స్.కామ్ రేటింగ్ : 2/5
ముందుమాట:
బాలీవుడ్ లో విజయం సాధించిన `హంటర్` సినిమా ను అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో తెలుగులో `బాబు బాగా బిజీ` టైటితో రీమేకైన సంగతి తెలిసిందే. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమా రీమేక్ గా నేడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కథా కమామీషు ఏంటో ఓసారి చూద్దాం.
కథ:
మాధవ్ ( అవసరాల శ్రీనివాస్) , వరప్రసాద్( ప్రియదర్శన్) ఉత్తేజ్ చిన్నప్పటి ఒకే కుటుంబంలో పెరిగిన మంచి స్నేహితులు. ఉత్తేజ్ కారణంగా మాధవ్ కు చిన్నప్పటి నుంచే అమ్మాయిల పట్ల ఆకర్షితుడవుతాడు. ఆ ఆకర్షణ ఎంత వరకూ అంటే సెక్స్ కు బానిసయ్యేంత వరకూ. స్కూల్ డేస్ లో నే మొదలైన ఆ అలవాటు పెళ్లి చేసుకునేంత వరకూ తీరని దాహంలానే కొనసాగిస్తాడు. అలాంటి మాధవ్ మారాలన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలోనే రాధ (మిస్తీ) చక్రవర్తి ని ఇష్టపడటం ..నిశ్చితార్ధం చేసుకుంటాడు. అయినా సెక్స్ కు బానిస కావడంతో ఆ అలవాటు మానుకోలేడు. అలాంటి మాధవ్ చివరికి మారాడా? రాధా గతం ఏంటి? ఉత్తేజ్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందనే ది తెరపైనే చూడాలి.
ఎనాలసిస్:
బాలీవుడ్ లో హంటర్ సినిమా పక్కా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కింది. హీరో క్యారెక్టరైజేషన్ చాలా నేచురల్ గా ఉంటుంది. రొమాన్స్ కు హైలైట్ చేస్తూనే తెరకెక్కించారు. మరో రకంగా చెప్పాలంటే పక్కా యూత్ టార్గెట్ మూవీ అది. అయితే తెలుగు వెర్షన్ కు వచ్చే సరికి కథలో చాలా మార్పులు చేశారు. అందులో సోల్ మాత్రమే తీసుకుని కథను నీట్ గా చూపిచాడు దర్శకుడు నవీన్ మేడారం. అయితే ఇలాంటి కథాశం ఉన్న సినిమాలను నీట్ గా చూపించడం అనేది రిస్క్ తో కూడుకున్నదే. ఎందకంటే హంటర్ రీమేక్ అంటే బోల్డ్ కంటెంట్ ను ఎక్స్ పె క్ట్ చేసే కుర్రాళ్లు థియేటర్ కు వస్తారు. అలా అనుకుని వస్తే మాత్రం మోస పోవడం ఖాయం. సినిమాలో మినిమం రోమాన్స్ కూడా ఎక్కడా మచ్చుకు కూడా కనిపించదు. తెరపై బొమ్మ పడినప్పటి నుంచి క్లైమాక్స్ వరకూ కథ అంతా ఒకే లా సాగుతుంది. దీనిని ఆసక్తిగా మరిచే క్రమంలో కథనాన్ని చెప్పడంలో క్లారిటీ ఉన్నా….రొమాన్స్ లేకపోవడం పెద్ద మైనస్ అవుతుంది. ప్రధమార్థంలో చిన్నప్పుడు అప్పటి పరిస్థితుల వాతావరణం…ఇప్పటి వాతావరణాన్నలి పోలుస్తూ కంపేరిజన్ చేయడం బాగానే ఉన్నా ఏ మాత్రం ఆకట్టుకోదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కు ముందైనా ఓ మసాలా సీన్ ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తాం. కానీ కనీసం సరైన కిస్సు సీన్ కూడాలేదు. ఇక ద్వితియార్థంలో చంద్రికతో కాస్త రొమాన్స్ పడించే ప్రయత్నం చేశారు. ఆమె తో మాధవ్ వేసిన ఒకే ఒక్క లిప్ లాక్ సీన్ హైలైట్ అయింది. అక్రమ సంబంధాలు వల్ల కాపురాలు కూలిపోతాయని చంద్రిక రియలైజ్ అవ్వడం…అటుపై మాధవ్ గతాన్ని గుర్తుచేసుకుని ఎలాగైన తన గతాన్ని రాధకు చెప్పాలనుకోవడం అంతా షరా మామూలు కథలో సాగిపోతుంది. ఇక క్లైమాక్స్ లో రాధ కూడా తన గతాన్ని వివరించడంతో ఇద్దరికి బ్యాలెన్స్ అయిపోతుంది. ఓవరాల్ గా టైటిల్ కు కథకు సంబంధం ఏ మాత్రం అనిపించదు. బాబు బాగా బిజీ అంటే చదవడానికి…వినడానికి మాత్రమే పనికొస్తుంది. సినిమా రిలీజ్ కు ముందు అవసరాల శ్రీనివాస్ భారీ సాహసం చేస్తున్నాడని బొలెడంత హైప్ క్రియేట్ అయింది. కానీ వాటిని ఏ మాత్రం టచ్ చేయలేకపోయాడు. సినిమా చూస్తే మబ్బులు విడిపోవడం ఖాయం.
నటీనటుల పనితీరు:
అవసరాల శ్రీనివాస్ పాత్ర బాగుంది. కానీ కొన్ని సన్నివేశాల్లో ఆ పాత్రకు లవ్ స్టోరీ అవసరామా? అనిపించింది. ఇన్నోసెంట్ ఎక్స్ ప్రెషన్స్ బాగా క్యారీ అయ్యాయి. ప్రియ దర్శిన్ పాత్ర బాగానే ఉంది. కానీ ఆ పాత్రను ఇంకా వాడుకుని ఉండాలి. ప్రియదర్శన్ కు తెలంగాణ యాస బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి కాసేపు ఆ పాత్రతో కామెడీ చేయించినా బాగుండేది. కానీ దర్శకుడు ఆ పాత్రను సీరియస్ మోడ్ లో చూపించాడు. ఆ సన్నివేశాలు పెద్దగా వర్కౌట్ కావు. మిస్తి నటన బాగుంది. మిగతా పాత్రలు తమ ఫరిది మేరకు న్యాయం చేశాయి.
సాంకేతిక వర్గం పనితీరు:
ఎడిటింగ్ లోపాలున్నాయి. చాలా సన్నివేశాలను ట్రిమ్ చేయాల్సింది. కెమెరా వర్క్ అంతగా అనిపించలేదు. కెమెరా ఫుల్ ఫిల్ కాలేదనిపిస్తుంది. పాటలు బాగున్నాయి. ప్రతీ సాంగ్ హైలైట్ గా ఉంటుంది. సినిమాకు పాటలే కొంచెం బలం. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరిగా:
ఈ బాబులో ఏ మాత్రం రొమాన్స్ లేదు
The post బాబు బాగా బిజీ` సినిమా సమీక్ష appeared first on MaaStars.