Quantcast
Channel: MaaStars
Viewing all articles
Browse latest Browse all 2793

మరో హారర్ ఎంటర్ టైనర్ లో నయనతార

$
0
0
831df823-76b1-4f21-8464-8bea01e4dce6 a1a9ea20-36c8-444f-96d3-000631cd38f7
మరో హారర్ ఎంటర్ టైనర్ లో నయనతార
తన సమకాలిక హీరోయిన్లు అందరూ  రేసులో వెనకబడిపోతుంటే… నయనతార మాత్రం యమ స్పీడుగా దూసుకుపోతూనే ఉంది. కధల ఎంపికలో ఆమె తీసుకునే “జాగ్రత్తలు, రిస్కులు”  అందుకు కారణాలు. కథ నచ్చితే గర్భవతిగా, పిల్లల తల్లిగా, లేదా చెవిటిదానిగా నటించడానికి సైతం ఆమె ఎంతమాత్రం సంకోచించదు. ఓ బిడ్డకు తల్లిగా నయనతార నటించిన హారర్ ఎంటర్ టైనర్ “మయూరి” ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం కోవలో నయనతారతో మరో చిత్రం రూపొందుతోంది. తెలుగు-తమిళ్ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో..  సాయిమణికంఠ క్రియేషన్స్ అధినేత జూలకంటి మధుసూదన్ రెడ్డి సమర్పణలో.. మానస్ రుషి ఎంటర్ ప్రైజస్ పతాకంపై కె. రోహిత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సజ్జూ భాయ్-రామ్ ప్రసాద్ వి.వి.ఎన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్. లేడి ఓరియంటెడ్ హారర్ డ్రామా ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి “దాస్ రామస్వామి”  దర్సకత్వం వహిస్తున్నారు. 
నిర్మాత కె. రోహిత్-సమర్పకులు జూలకంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. “భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని తెలుగులో అందించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ఈ చిత్రం టైటిల్ మరియు మిగతా వివరాలు ప్రకటించనున్నాం” అన్నారు. 
ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సజ్జూ భాయ్-రామ్ ప్రసాద్ వి.వి.ఎన్,  సమర్పణ: జూలకంటి మధుసూదన్ రెడ్డి, నిర్మాత: కె.రోహిత్, కథ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: దాస్ రామస్వామి!!

The post మరో హారర్ ఎంటర్ టైనర్ లో నయనతార appeared first on MaaStars.


Viewing all articles
Browse latest Browse all 2793

Trending Articles