`బాహుబలి-2` గురించి ప్రపంచమంతా పొగిడేసింది. పోగిడేస్తోంది కూడా. `బాహుబలి` పార్టు-1, 2 లు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద 1000కోట్లు వసూళ్లు ఖాయమని అంటున్నారు. అంతా వార్ సన్నివేశాలు… గ్రాఫీక్స్ పైనే బాగానే ఫోకస్ పెట్టాం కానీ ఓ లాజిక్ మిస్ అయ్యాం. ఇంతకీ ఏంటా లాజిక్ అనుకుంటున్నారా? ప్రభాస్-అనుష్క ఒక పెయిర్ గా నటించారు. వీరిద్దరికి పుట్టిన బిడ్డనే మహేంద్ర బాహుబలి. మరి రానాకు ఫెయిర్ ఎవరు? రానాకు కొడుకు గా అడవి శేషు నటించాడు. ఫస్ట్ పార్టు లో రివీల్ చేశారు..పార్టు-2 లో కూడా ఆ పాత్ర తలను నరికి తీసుకువెళ్లున్నట్లు చూపించారు. అయితే రానా భార్య పాత్రను ఎవరు పోషించారన్నది మాత్రం జక్కన్న ఎక్కడా రివీల్ చేయలేదు . మరి జక్కన్న ఈ లాజిక్ ను ఎలా మిస్ అయినట్లు.
అయితే భల్లాల దేవ, దేవసనను 25 ఏళ్ల పాటు బంధీగా ఉంచాడు. బాహుబలి తో 1 సంవత్సరం ఉంటే నాతో మాత్రం 25 సంవత్సరాలు మాహిష్మతి బంధీగా ఉన్నావని పంచ్ లు వేస్తాడు తన భార్య ఎవరన్నది మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు.
The post ఇంతకీ భల్లాల దేవ భార్య ఎవరు? appeared first on MaaStars.