హీరో శ్రీకాంత్ కెరీర్ ప్రతినాయకుడిగానే ప్రారంభమైంది. అసలు ఇండస్ర్టీకి వచ్చింది విలన్ అవుదామనే. కానీ ఇండస్ర్టీ అతన్ని హీరోని చేసింది. కొన్నాళ్ల పాటు తన మార్క్ సినిమాలతోనే బాగానే ఆకట్టుకున్నాడు. అయితే వారసుల తెరంగేట్రంతో శ్రీకాంత్ రేసులో వెనుకబడిపోయాడు. దీంతో ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు.
అయితే ఇప్పుడు మళ్లీ తన డ్రీమ్ నెరవేరబోతుంది. విలన్ గా సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు. అక్కినేని నాగచైతన్య- కృషమరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో శ్రీకాంత్ విలన్ పాత్రకు ఎంపికైనట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఛార్మింగ్ హీరో కన్నడలో ఓ సినిమా చేస్తున్నాడు.
The post విలన్ గా శ్రీకాంత్! appeared first on MaaStars.