అప్పట్లో మణిరత్నం-అభిషేక్ బచ్చన్ కాంబినేషన్ లో వచ్చిన `గురు` సినిమా సెట్స్ లో ఓ విషాదం చోటుచేసుకుంది. ఆ సినిమాకు లైట్ మెన్ గా పనిచేస్తోన్న మణిమారన్ రక్తసంబంధిత వ్యాధికి గురై ప్రాణాల మీదకు వచ్చింది. ఆసమయంలో మణిమారన్ కు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి సహాయం అందలేదు. దీంతో మణిమారన్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు 2 లక్షలు సంఘం నుంచి రావాల్సియుంది.
అయితే ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా మణి చేతికి చేరలేదు. అడిగితే రెండు లక్షలు లంచం అడిగినట్లు తెలిపాడు. దీంతో గత్యంతరం లేని పక్షంలో మణిరత్నం ఇంటిముందే ఆత్మహత్య చుసుకుంటానని తాజాగా హెచ్చరించాడు.
The post ఆదుకోకపోతే ఆత్మహత్యే! appeared first on MaaStars.