బబ్లీ హీరోయిన్ రాశీ కు పెద్దగా విజయాలు లేకపోయినా ఆఫర్లు మాత్రం క్యూ కడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం `ఆక్సీజన్`, `జై లవకుశ`, `టచ్ చేసి చూడు` వంటి బడా సినిమాల్లో నటిస్తోంది. అయితే తాజాగా అమ్మడు మలయాళం ఇండస్ర్టీపై కూడా కాన్సంట్రేషన్ చేసిందని తెలుస్తోంది. కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటిస్తోన్న విలన్ సినిమాలో అమ్మడు నెగిటివ్ టచ్ ఉన్న లేడీ డాన్ పాత్ర కు ఎంపికైందని సమాచారం.
కంప్లీట్ స్టార్ ను ఢీ కోట్టే పాత్ర కావడంతోనే నెగిటివ్ అయినా అంగీకరించిందని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ వార్త కాస్త ఆలస్యంగానే వెలుగు లోకి వచ్చింది.
The post లేడీ డాన్ గా రాశీఖన్నా! appeared first on MaaStars.