మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన `పులిమురగన్` తెలుగు, కన్నడ భాషల్లో ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. 100 కోట్లు వసూళ్లు కొల్లగొట్టిన తొలి కన్నడ సినిమా గా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పుడీ చిత్రం గిన్సీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. అది గనుక సాధ్యం అయితే పులిమురగన్ ఖాతాలో మరో ఘనత సొంతం చేసుకున్నట్లే.
లార్జెస్ట్ 3డీ స్రీనింగ్ థియేటర్ లో పులిమరుగన్ ప్రదర్శనకు ముస్తాబవుతోంది. గతంలో హలీవుడ్ మూవీ `మెన్ ఇన్ బ్లాక్` చిత్రం ఇదే థియేటర్ లో ప్రదర్శింపబడి 6819 మంది వీక్షించి గిన్సీస్ రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పుడీ రికార్డును పులిమురగన్ తిరగరాయనుంది. ఏప్రిల్ 12వ తేదిన యాడ్ లక్స్ కన్వెన్షన్ సెంటర్ లో పులిమునగర్ 3డీ స్ర్కీనింగ్ కానుంది. దీనిని దాదాపు 10,000 మంది వీక్షించనున్నారు. దీన్ని యుఎఫ్ వో, ఇండియా లార్జెస్ట్ డిజిటల్ సినిమా డిస్ర్టిబ్యూషన్ నెట్ వర్క్ దీన్ని ఆర్గనైజ్ చేస్తోంది.
The post గిన్నీస్ రికార్డ్ లక్ష్యంగా పులిమురగన్! appeared first on MaaStars.