తెలుగు సినీ పరిశ్రమకు నటుడిగా ఎంట్రీ ఇచ్చి తాజాగా సుఖీభవ మూవీస్ అనే బ్యానర్ స్థాపించి `రక్షకభటుడు` చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఏ.గురురాజ్. ‘రక్ష, `జక్కన్’ వంటి హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో నిరూపించుకున్న వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రీచా పనై, బ్రహ్మానందం, బాహుబలి ప్రభాకర్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నఈ సి నిమా మే 5న సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది.
కాగా నేడు( మంగళవారం) ఈ చిత్ర నిర్మాత ఏ. గురురాజ్ పుట్టిన రోజు సందర్భంగా నిర్మాత, సంతోషం అధినేత సురేష్ కొండేటి గురురాజ్ ను కలిసి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే చిత్ర నిర్మాత వంశీ కృష్ణ ఆకేళ్ల..ఇతర టీమ్ సభ్యులు కూడా ఆయనకు విషెస్ తెలియజేశారు.
The post నిర్మాత గురురాజ్ కు బర్త్ డే విషెస్ తెలియజేసిన మరో నిర్మాత సురేష్ కొండేటి! appeared first on MaaStars.