మహేశ్‌బాబు – మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాపై ఇప్పటికే భారీ అంచ నాలున్నాయి. ఫస్టు లుక్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫస్టు లుక్ పోస్టర్ విడుదల ఆలస్యమైందని అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఉగాది కానుకగానైనా విడుదల చేస్తారని అంతా భావించారు. అయితే ఆరోజు కూడా దాటిపోయింది. దీంతో మహేష్ నేరుగా లైన్ లోకి రావాల్సి వచ్చింది.
‘మహేశ్ 23 చిత్రం ఫస్ట్‌లుక్ కోసం మీరు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. సినిమా కోసం మా టీమ్ అహర్నిశలు శ్రమిస్తోంది. ఫస్ట్‌లుక్ త్వరలోనే విడుదల కాబోతోంది.. దయచేసి కాస్త ఓపికతో ఉండాలని కోరుతున్నా. లవ్యూ గాయ్స్’ అని మహేశ్ అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
The post ఫ్యాన్స్ కు మహేష్ విజ్ఞప్తి appeared first on MaaStars.