వెంకటేష్, రితిక సింగ్ ప్రధాన పాత్రల్లో వై నాట్ స్టూడియోస్ బ్యానర్‌పై సుధా కొంగ ప్రసాద్ దర్శకత్వంలో ఎస్.శశికాంత్ నిర్మించిన చిత్రం `గురు`. అన్ని పనులు పూర్తిచేసుకున్న సినిమా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకటేష్ మాట్లాడుతూ….
**తమిళ, హిందీ భాషల్లో సినిమా చేయకముందే ఈ కథ నా దగ్గరకు వచ్చింది. కానీ ఆసమయంలో డెంగ్యు ఫీవర్ కారణంగా చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సధు గారు ఇతర భాషల్లో చేయాల్సి వచ్చింది. సినిమా రిలీజ్ తర్వాత చూశాను. చాలా బాగుంది. ఎలాగైనా చేయాలనిపించడంతో ఇప్పటికీ తీయగలిగాం. గురువు-శిష్యుల మధ్య రిలేషన్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
** స్కూల్లో పీటీ మాస్టార్స్ టఫ్ గా ఉంటారు. కోచెస్ ఎలా ఉంటారు. వాళ్ల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందనేది బాగా స్టీడీ చేశా. ఐదారు నెలలు పాటు పాత్ర కోసం బాక్సింగ్ నేర్చుకున్నా. అందుల్లే స్టిక్ అయి నటించా. చాలా సినిమాలు ఒకే ఎక్సప్రెషన్ తో చేయడం వల్ల అవే క్యారీ అవుతాయనిపించింది. కానీ అలాంటివి ఎక్కడా రిపీట్ కాలేదు. డిఫరెంట్ గా..ఫ్రెష్ గా ఉంటుంది. ఇది నాకు ఒక ఛాలెంజింగ్ రోల్
** ఈ సినిమా నాకు ఓ ఎమోషనల్ జర్నీ. చాలా సన్నివేశాలను హృదయాలను హత్తుకుంటాయి. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకు వచ్చే టప్పుడు కన్నీళ్లు చెమర్చడం ఖాయమని బలంగా చెప్పగలను.
** సుందరా కాండలో ప్రోఫెసర్ జీవితంలో ఓ యంగ్ గాళ్ల్ రావాలనుకుంటుంది. అది క్యూట్ ఎమోషన్. అదోక డిఫరెంట్ ఎట్రాక్షన్ . మెచ్యురిటీ లేని అమ్మాయి అన్నీ తెలిసిన వ్యక్తి జీవితంలోకి రాడం అనేది ఫులిష్ నెస్ గా ఉంటుంది. అలాంటి సన్నివేశాలను డీల్ చేయడం కొంచెం కష్టం. కానీ ఇలాంటి కథల్లో అలాంటి సన్నివేశాలను సింపుల్ గా డీల్ చేయవచ్చు. రిటైర్డ్ స్పోర్స్ట్ పర్సన్ అలా ప్రవర్తిస్తే నీ బాబు వయసే నాది వెళ్లి పనిచూసుకో అని చెప్పగలం.
** పెర్పామెన్స్ పరంగా నూటికి నూరు శాతం మంచి అవుట్ ఫుట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో జయపజయాలున్నాయి. వీటిలో కొన్ని ఛెలెంజింగ్ రోల్స్ కూడా ఉన్నాయి. గత 30 ఏళ్ల నుంచి ప్రేక్షకాభిమానులు నన్ను ప్రోత్సహిస్తున్నారు. అందుకు నేను చాలా లక్కీ. సినిమా ఫెయిల్ అయినప్పుడు మళ్లీ ఆ తప్పులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే నా దగ్గర సమాధానం లేదు. అదే తెలిస్తే భవిష్యత్తును ముందే ఊహించవచ్చు కదా.
** సుధగారు కథను బాగా డీల్ చేశారు. పెద్దగా మార్పులు లేకుండా కమర్శియల్ గా తీర్చిదిద్దారు. ఎమోషన్స్ సినిమాకు హైలైట్ గా ఉంటాయి. వాటిని బేస్ చుసుకుని అల్లిన కథే ఇది. ట్యూన్ వినగానే క్యాచీగా అనిపించింది. దీంతో నేను కూడా ఓ పాట పాడాను. బాగా వచ్చింది. పాటలన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మంచి సాహిత్యం ట్యూన్స్ కుదిరాయి.
** సినిమాలు చూసే ఆడియన్స్ లో చాలా మార్పు వచ్చింది. కానీ మన ఇండస్ర్టీలో ఇంకా మార్పు రాలేదు. ఆ మార్పు వచ్చినప్పుడే ఇంకా డిఫరెంట్ సినిమాలు చేయగలం. మరి ఆ మార్పు ఎప్పుడు వస్తుందో తెలియదు. అదో పెద్ద మిస్టరీ లా ఉంది.
** టీవీ రియాల్టీషోలు అవి ఇప్పట్లో చేయాలనుకోవడం లేదు. అంత సమయం కూడా లేదు. నేనే ఎన్నో సమస్యలతో ఉన్నా. కొత్త వాటిని నెత్తి మీద వేసుకోవడం ఇష్టం లేదు. నేను చేసిన సినిమాల గురించి కూడా పెద్దగా పట్టించుకోను. నిజానికి నా పాత సినిమాలు వేరే వాళ్లు చెబితే..నేనే చేశాననిపిస్తుందని అన్నారు.
The post గురు ఇదొక ఛాలెంజింగ్ రోల్: విక్టరీ వెంకటేష్! appeared first on MaaStars.