విశ్వనటుడు కమల్‌హాసన్ ను ఇంకా వివాదాలు వద్దల్లేదు. అటు వ్యక్తిగతంగా..ఇటు వృత్తిగతంగా కమల్ రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. పోలీసు ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది. ఇటీవలే మహాభారతంలో ద్రౌపది గురించి అసభ్యకరంగా మాట్లాడాడంటూ కమల్‌పై మక్కల్‌కచ్చి కార్యకర్తలు విరుచుకుపడ్డారు. అంతటి తో ఆగకుండా కమల్‌పై కేసు నమోదు చేశారు.
తాజాగా ఈ వ్యాఖ్యలే హిందువుల మనోభావాల్ని దెబ్బ తీసారంటూ బసవేశ్వర మఠంకు చెందిన ప్రనవనంద స్వామి పోలీసులను ఆశ్రయించారు. ప్రనవనంద స్వామి ఆయనపై బెంగుళూరు కోర్టుకు ఫిర్యాదు చేశారు. “మగాళ్లు జూదంలో పాంచాలిని ఓ పావులా వాడుకున్నారని మహాభారతం చెబుతోంది” అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించినందుకు కమల్‌పై ఇలా అసహనం వెల్లువెత్తుతోంది.
The post కమల్ పై పోలీసు కేసు appeared first on MaaStars.