మహానటి సావిత్రి జీవితకథను యువ దర్శకుడు నాగ్ అశ్విన్ వెండితెరకు ఎక్కించడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ పోషిస్తుండగా, జమున పాత్రలో సమంత నటిస్తుంది. ఇంకా ఈ కథలో పలువురు కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా భాగమయ్యే అవకాశం ఉంది.
ఈ బయో గ్రఫీలో మరో ప్రధాన పాత్ర జెమినీ గణేషన్ ది. సావిత్రి ఎంతగానో ప్రేమించిన వ్యక్తి ఆయన. ఆ ప్రేమ ఆయనను వివాహం చేసుకునేవరకు తీసుకెళ్లింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిస్థితుల ఆయన దూరమయ్యారు. అయితే ఇప్పుడీ పాత్ర ను ఎవరు పోషిస్తారు అన్న ప్రశ్న రెయిజ్ అవ్వగా సూర్య అని వినబడుతోంది. ఇటీవలే దర్శకుడు సూర్యను కలసి కథను కూడా వినిపించాడట. కానీ సూర్య మాత్రం ఇంకా ఒకే చెప్పలేదని సమాచారం.
The post సావిత్రిలో గజిని appeared first on MaaStars.