ప్రస్తుతం యంగ్ హీరో నాగ్ అన్వేష్ `ఏంజిల్` సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా నేడు ఆయన పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాగ్ అన్వేష్ మాట్లాడుతూ ` ఏంజిల్ డబ్బింగ్ చెబుతున్నా. అవుట్ ఫుట్ చూసుకుని చాలా నమ్మకం ఏర్పడింది. డిఫరెంట్ గా ఉండే మూవీ ఇది. ఇందులో సీజీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. గ్రాఫీక్ సన్నివేశాలు హైలైట్ గా ఉంటాయి. సినిమా నిర్మాణం కోసం నిర్మాత ఎక్కడా రాజీ పడలేదు. దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత సినిమా చేస్తున్నా. నాలో కొన్ని ఛేంజెస్ అవసరం అని పలువురు సూచించారు. దాంతో కొన్ని మార్పులు కూడా చేశా. జానీ, శేఖర్ మాస్టర్ డ్యాన్స్ బాగా కంపోజ్ చేశారు. బాగా చేసాననుకుంటున్నాను` అని అన్నారు. ఈ వేడుకలో ఏంజిల్ చిత్ర నిర్మాత తదితరులు పాల్గొన్నారు.
The post నాగ్ అన్వేష్ బర్త్ డే వేడుకలు appeared first on MaaStars.