ఎనర్జిటిక్ స్టార్ రామ్ కథానాయకుడిగా నటించిన హైపర్ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో మరోసారి సక్సెస్ ఇచ్చిన దర్శకుడినే నమ్ముకున్నాడు. నేను శైలజ ఫేం కిషోర్ తిరుమలతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే సినిమా ఆలస్యమైన నేపథ్యంలో ప్రాబ్లమ్ దర్శకుడిదా? రామ్ దా? అనే సందేహాలు రేకెత్తాయి. అయితే రామ్ అని తేలింది.
ప్రస్తుతం ఈ హీరో కథ కోసం సిక్స్ ఫ్యాక్ లుక్ లో దర్శనమివ్వడానికి రెడీ అవుతున్నాడట. అందుకే సినిమా సెట్స్ కు వెళ్లడం ఆలస్యం అవుతుందని సమాచారం. ఇప్పటికే టాలీవుడ్ లో సిక్స్ ఫ్యాక్ లతో చాలా మంది హీరోలు మెప్పించారు. మరి ఈ యంగ్ హీరో స్థాయిలో ఆకట్టుకుంటాడో చూద్దాం.
The post సిక్స్ ఫ్యాక్ తో ఎనర్జిటిక్ స్టార్ appeared first on MaaStars.