మ్యాస్ర్టో ఇళయరాజా పాటలను గాయకుడు ఎస్.పి.బాలసుహ్మణ్యం వేదికలపై పాడకూడదంటూ ఇటీవల ఇళయారాజా ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి పొరపొచ్చాలొచ్చాయి. కోలీవుడ్, టాలీవుడ్ లలో సంచలనమైందీ ఈ వార్త. అయితే ఇప్పుడు వీళ్లిదర్ని కలపడానికి నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, హీరో విశాల్ నడుం బిగించాడు.
ఒకే వేదికపై కలపనున్నట్టు విశాల్ తెలిపాడు. త్వరలో తమిళ సినీ పరిశ్రమ తరఫున ఇళయరాజాకు సన్మాన సభను నిర్వహించనున్నామని, అందులో బాలూ స్వయంగా కచేరీ చేస్తారని విశాల్ వెల్లడించారు. ఈ విషయంపై ఇప్పటికే ఇరువుని సంప్రదించామని తెలిపారు.
The post ఎస్.పి.బీ- మ్యాస్ర్టో లను కలుపుతా! appeared first on MaaStars.