తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంతో మళ్లీ అక్కడ రాజకీయ వాతావరణం వెడెక్కింది. ఆర్కే నగర్ నియోజిక వర్గానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీతో పాటు, బలమైన పార్టీలన్ని కూడా రంగంలోకి అభ్యర్ధులను దింపేసాయి. భాజపా అభ్యర్థిగా సంగీత దర్శకుడు గంగై అమరన్ పోటీచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన రజనీకాంత్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. అయితే ఈ వార్త ఇప్పుడు కోలీవుడ్ పెను సంచలనం రేపింది. భాజాపాకు రజనీ మద్దతు ఇస్తున్నారని జోరుగా వైరల్ అయింది. దీంతో రజనీ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తను ఏ పార్టీకి సపోర్ట్ ఇవ్వడం లేదని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
The post నేనెవ్వరికీ సపోర్టర్ ను కాదు appeared first on MaaStars.