మొన్ననే బాస్ మెగాస్టార్ చిరంజీవి `ఖైదీ నంబర్ 150`వ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రప్ఫాడించేశారు. 150 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించారు. నౌ ఇట్స్ టైమ్ ఫర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన కథానాయకుడిగా నటించిన `కాటమరాయుడు` ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. తాజాగా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది టీమ్.
ఇప్పటికే `కాటమరాయుడు` పాటలు, ట్రైలర్లు యూ ట్యూబ్ లో సంచలనం క్రియే చేశాయి. దీంతో అంచనాలు స్కైని దాటిపోయాయి. రాయుడు సరికొత్త రికార్డులు సృష్టించడం షురూ ప్రేక్షకాభిమానులు బలంగా చెబుతున్నారు. `అత్తారింటికి దారేది` చిత్రంతో 100 కోట్ల క్లబ్ లో చేరిన పవన్ ఈ సారి ఆ రికార్డులను చెరిపేయడం పక్కా అంటున్నారు. ఈ చిత్రానికి డాలీ దర్శకత్వం వహించారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ పై శరత్ మరార్ నిర్మించారు.
The post నౌ ఇట్స్ టైమ్ ఫర్ పవర్ స్టార్ `కాటమరాయుడు` appeared first on MaaStars.